Begin typing your search above and press return to search.

ఇంతకీ సమంత ప్రమోషన్లకు వస్తోందా?

By:  Tupaki Desk   |   27 Aug 2016 1:30 AM GMT
ఇంతకీ సమంత ప్రమోషన్లకు వస్తోందా?
X
ఇప్పుడు అందరి కళ్ళూ సెక్సిణి సమంతపైనే ఉన్నాయి. ఎందుకంటే అమ్మడు ఆల్రెడీ 'జనతా గ్యారేజ్' సినిమా ఆడియో లాంచ్ కు హ్యాండిచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేసింది. సినిమా నచ్చలేదనో.. ట్రైలర్ కిక్కురాలేదనో.. మానేసిందనే రూమర్లను ఎట్టాగో విన్నాం. అయితే హెల్త్ బాగాలేదని అప్పుడు తప్పించుకున్న ఈ సుందరాంగి.. ఇంతకీ ఇప్పుడు ప్రమోషన్లకు వస్తోందా?

జనతా గ్యారేజ్ సినిమా ప్రమోషన్లను ఆల్రెడీ మొదలెపెట్టేశాడు ఎన్టీఆర్. రేడియో ఛానళ్లను తన ఆఫీసుకు పిలిపించుకుని మరీ ఇంటర్యూలు ఇచ్చాడు. ఈరోజు ఎలాగో యు/ఎ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది కాబట్టి.. రేపటి నుండి రిలీజ్ డేట్ మోత మోగిపోతుంది. ఆల్రెడీ టివిల్లో జనతా గ్యారేజ్ టీజర్లతో సెప్టెంబర్ 1న రిలీజ్ అంటూ రచ్చ చేస్తున్నారు. చూస్తుంటే సోమవారం నుండి కొరటాల శివ - దేవిశ్రీప్రసాద్ - నిత్యా మీనన్ కూడా ప్రమోషన్లు చేస్తారట. సేమ్ డేటుకు రిలీజ్ అనుకున్నారు కాని.. ఇంతవరకు మలయాళ వర్షెన్ ఆడియో రిలీజ్ పై క్లారిటీ లేకపోవడం ఒక పంచ్ అయితే.. అసలు సమంత వస్తుందా రాదా అనే విషయం మరో పంచ్.

ఎక్కడ మీడియా ముందుకు వస్తే హీరో నాగ చైతన్యతో తన ప్రేమాయణం అండ్ పెళ్ళి గురించి ప్రశ్నిస్తారోనని అమ్మడు మీడియా ముందుకు రావట్లేదు అంటున్నారు సన్నిహితులు. కాని తమిళనాడులో చాలా రిబ్బన్ కటింగులకు వెళుతూ అక్కడి మీడియాతో బాగానే మాట్లాడుతోందిగా.. పైగా ఇక్కడ కూడా ట్విట్టర్ లో ఫుల్లు యాక్టివ్ గానే ఉంటోందిగా. సర్లేండి.. వెయిట్ అండ్ సి.