Begin typing your search above and press return to search.

చైతూ నా టెంపర్‌ ను కట్‌ చేశాడు : సమంత

By:  Tupaki Desk   |   19 Sep 2018 5:30 PM GMT
చైతూ నా టెంపర్‌ ను కట్‌ చేశాడు : సమంత
X
టాలీవుడ్‌ లవ్‌ కపుల్‌ నాగచైతన్య, సమంత గత సంవత్సరం అక్టోబర్‌లో ఒక్కటైన విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత వీరిద్దరి కెరీర్‌ పరంగా ఎలాంటి మార్పులేకున్నా కూడా వ్యక్తిగత విషయాల్లో మాత్రం చాలా మార్పు వచ్చినట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యలో సమంత చెప్పుకొచ్చింది. పెళ్లి అయ్యి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో తన వైవాహిక జీవితం గురించి, ఇంకా పలు ఆసక్తికర విషయాల గురించి సమంత షేర్‌ చేసుకుంది. పెళ్లికి ముందు నుండి కూడా చైతూ తనకు మంచి స్నేహితుడని, మొదటి చిత్రం ‘ఏమాయ చేశావే’ షూటింగ్‌ సమయంలోనే తన వల్ల చాలా నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.

పెళ్లికి ముందు తాను చాలా షార్ట్‌ టెంపర్‌ గా ప్రవర్తించేదాన్ని. చైతూ నా షార్ట్‌ టెంపర్‌ ను చాలా తగ్గించాడు. తను చాలా కూల్‌, ఎలాంటి విషయాన్ని అయినా కూడా చాలా కూల్‌గా తీసుకుంటాడు. అదే తరహాలో నేను కూడా కూల్‌ గా మారేందుకు ప్రయత్నిస్తున్నాను. గతంతో పోల్చితే నా షార్ట్‌ టెంపర్‌ తగ్గినట్లుగా అందరు చెబుతూ ఉన్నారని అంది. ఇతరుల విషయంలో నా ప్రవర్తన గతంతో పోల్చితే ఇప్పుడు మారిందని కూడా సమంత చెప్పింది. పెళ్లితో అమ్మాయి జీవితం చాలా మారుతుందని, తన జీవితంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయని సమంత ఇంటర్వ్యూలో పేర్కొంది.

గత వారం సమంత నటించిన యూటర్న్‌ మరియు చైతూ నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఈ రెండు సినిమాలు మంచి టాక్‌ను దక్కించుకున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్‌ సంతోషంను వ్యక్తం చేస్తున్నారు. మొదట యూటర్న్‌ కాస్త మందకోడి కలెక్షన్స్‌ తో నడిచినా కూడా మెల్ల మెల్లగా పుంజుకుంటూ వస్తోంది. ఇప్పటికే తమిళం మరియు తెలుగు వర్షన్‌లలో మంచి వసూళ్లను రాబడుతున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.