Begin typing your search above and press return to search.

స‌మంత‌లో 96 ఛేంజెస్..!

By:  Tupaki Desk   |   13 Oct 2019 11:02 AM GMT
స‌మంత‌లో 96 ఛేంజెస్..!
X
అక్కినేని కోడలు స‌మంత 96 రీమేక్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్నారు. మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సి. ప్రేమ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. స‌మంత‌పై చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ సంద‌ర్బంగా త‌న ట్విట‌ర్ ఖాతాలో ఓ భావోద్వేగ‌పు పోస్ట్ పెట్టింది.

96లో జాను రోల్ నాకు స‌వాల్ చేసింది. నిన్న కంటే ఉత్తమంగా న‌న్ను జాను రోల్ మ‌ర్చేసింది. తొలిసారి న‌న్ను నేను కొత్త‌గా చూసుకుంటున్న ఫీలింగ్ క‌లుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా పాత్ర‌లు పోషించాను. మ‌జిలీ లో చైత‌న్య భార్య‌గా న‌టించిన రోల్ ఒక ఎత్తు అయితే... 96లో జాను మ‌రో ఎత్తు. జీవితంలో కొన్ని పాత్ర‌లు మ‌న‌సుకు బ‌లంగా తాకుతాయి. అందులో ఇది ఒక‌టి. అనునిత్యం మ్యాజిక్ క్రియేట్ చేసే చిత్ర బృందంతో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది.

96 రీమేక్ బృందం నా డ్రీమ్ టీమ్. ప్రేమ్ కుమార్.. శ‌ర్వానంద్ ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని ట్వీట్ చేసింది సామ్. ఈ సంద‌ర్భంగా త‌న‌లోని ఉద్వేగాన్ని దాచుకోలేక‌పోయింది. సమంత ఇటీవ‌లే యూట‌ర్న్ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. యూట‌ర్న్ భారీ విజ‌యం సాధించ‌క‌పోయినా.. స‌మంత పాత్ర‌కు మంచి పేరొచ్చింది. ప్ర‌స్తుతం హిందీలో ది ఫ్యామిలీ మ్యాన్ -2 అనే వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. ఇది సామ్ కు తొలి వెబ్ సిరీస్. క‌లిసొస్తే వెబ్ సిరీస్ ల‌లోనే స‌మంత స‌త్తా చాటే అవ‌కాశం ఉంది. అలాగే సొంతంగా వెబ్ సిరీస్ ల నిర్మాణం.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల నిర్మాణం అంటూ చాలానే ప్లాన్స్ ఉన్నాయి.