Begin typing your search above and press return to search.

హీరో హీరోయిన్‌ ఎవ్వరూ లేరు -సమంత

By:  Tupaki Desk   |   28 May 2016 4:57 AM GMT
హీరో హీరోయిన్‌ ఎవ్వరూ లేరు -సమంత
X
''హీరో హీరోయిన్ ఎవ్వరూ లేరండి. కేవలం ఒక కథ ఉంది. ఆ కథే హీరో. మేమందరం కేవలం క్యారెక్టర్లం మాత్రమే. ఇలాంటి సినిమా చేసినందుకే హ్యాపీ'' అంటోంది సమంత. ''అ..ఆ'' సినిమాను ఎక్సటెన్సివ్‌ గా ప్రమోట్‌ చేస్తున్నమన చెన్నయ్ చంద్రం.. ఈ సినిమా గురించి చాలా గొప్పలే చెప్పింది. ఇప్పటికే అత్తారింటికి దారేది.. సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సమంత.. ఇప్పుడు మూడోసారి ఆయనతో పనిచేస్తోంది. అందుకే ఈ సినిమా గురించి ఆమెనే చాలా కొత్తగా చెప్పగలదు మరి.

''ఇంతకి ముందు సినిమాలూ ఈ సినిమాలూ చాలా డిఫరెంట్‌. పంచ్‌ డైలాగులు లేవు.. కేవలం ఫ్లో లో వచ్చే మాంచి మాంచి డైలాగులు అంతే. అన్ని క్యారక్టర్లకూ వాల్యూ అండ్‌ ఇంపార్టెన్స్ ఉంది. అందుకే అందరూ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ లో ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్‌ అద్భుతం అని చెప్పారు'' అంటోంది సమంత. ఇప్పటికే ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ పెద్దది.. ఆమెనే హీరో.. అనే రూమర్లు రావడంతో.. అమ్మడు ఇప్పుడు స్టోరీ మీద ఎంఫసిస్‌ పెట్టినట్లుంది. అయితే సమంత చూపిస్తున్న కాన్ఫిడెన్స్ మాత్రం అద్బుతం.

''అ..ఆ సినిమా తరువాత అసలు నేను ఏ సినిమా చేయాలని నాకు అర్దం కావట్లేదు'' అంటూ ముగించింది సమంత.