అత్తారిల్లు అద్భుతంగా ఉందట!

Sun Oct 22 2017 18:41:21 GMT+0530 (IST)

సమంత - నాగచైతన్యల పెళ్లి గోవాలో హిందూ - క్రైస్తవ సంప్రదాయాల్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో నాగార్జున హైదరాబాద్ లో వారిద్దరి రిసెప్షన్ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు. చైతూ తల్లి లక్ష్మి చెన్నైలోని తన నివాసంలో కొత్త జంటకు  గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఈ వేడుకకు దగ్గుబాటి ఫ్యామిలీ తరపు వారు హాజరయ్యారు. పెళ్లి తర్వాత ఆ ఇంట్లో తొలిసారి అడుగుపెట్టిన కొత్త కోడలికి అత్తారిల్లు తెగ నచ్చేసిందట. తన అత్తగారిల్లు చాలా బాగుందని కితాబిచ్చింది సమ్మూ. ఆ ఇంట్లోని మొక్కల కోసం తన అత్తయ్య ఏర్పాటు చేసిన కుండీలను చూసి సమంత ఆశ్చర్యపోయింది. అత్తగారి కళాభిరుచికి కొత్త కోడలు ఫిదా అయిపోయింది.ఆ రిసెప్షన్ కు రాణాతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. తన అత్తయ్య లక్ష్మి - రాణా - ఇతర కుటుంబసభ్యులతో దిగిన ఫొటోలను సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ రిసెప్షన్ లో అత్తాకోడళ్ళిద్దరూ ఒకే రకమైన డ్రెస్ లో మెరిసిపోయారు. ఆ ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ సమంతకు తెగ నచ్చేసిందట. దీంతో లక్ష్మి నివాసంలోని బొమ్మలు - చెట్ల కొమ్మలు - కుండీల ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. తన అత్తగారిల్లు చాలా అద్భుతంగా ఉందని కామెంట్  కూడా చేసింది. వాటితో పాటు విమానంలో భర్త చైతూ పక్కన కూర్చుని దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఎక్కడికైనా తీసుకెళ్లు’ అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం సమంత ‘మహానటి’ చిత్రంలో నటిస్తోంది. నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.