Begin typing your search above and press return to search.

సమంత మళ్లీ ఎంత సక్కగున్నావే...!

By:  Tupaki Desk   |   14 Dec 2018 5:30 PM GMT
సమంత మళ్లీ ఎంత సక్కగున్నావే...!
X
రామ్‌ చరణ్‌ - సమంతల ‘రంగస్థలం’ చిత్రం ఈ సంవత్సరంలోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ చిత్రంగా నిలిచిన విషయం తెల్సిందే. భారీ వసూళ్లను రాబట్టి టాలీవుడ్‌ 2018 టాప్‌ చిత్రంగా నిలిచింది. ఆ చిత్రంలోని ఎంత సక్కగున్నావే అనే పాట ఎంత ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇప్పుడు సమంత మూవీకి ఆ టైటిల్‌ ను ఖరారు చేసే పనిలో ఉన్నట్లుగా నందిని రెడ్డి ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

‘యూటర్న్‌’ చిత్రం తర్వాత సమంత మిస్‌ గ్రానీ అనే కొరియన్‌ మూవీ రీమేక్‌ లో నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. చాలా సైలెంట్‌ గా ఈ చిత్రాన్ని మొదలెట్టారు. షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ ను కూడా పూర్తి చేశారు. మిస్‌ గ్రానీ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసిన నందిని రెడ్డి కథానుసారంగా ఈ చిత్రానికి ‘ఓ బేబి.. ఎంత సక్కగున్నావే’ అనే టైటిల్‌ ను ఖరారు చేసిందట.

ఈ రీమేక్‌ ను నిర్మిస్తున్న సురేష్‌ బాబు ఈ టైటిల్‌ ను రిజిస్ట్రర్‌ చేయించేందుకు ఏర్పాట్లు కూడా చేయిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. టైటిల్‌ తోనే సినిమాపై దృష్టి పడేలా నందిని రెడ్డి మంచి టైటిల్‌ ను ఎంపిక చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. సమంత ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతుందట. ముఖ్యంగా బామ్మ పాత్రలో సమంత మేకప్‌ మరియు యాక్టింగ్‌ బాగుంటుందనే టాక్‌ వినిపిస్తుంది. మరో వైపు సమంత భర్త నాగచైతన్యతో కలిసి ‘మజిలి’ అనే చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.