Begin typing your search above and press return to search.

స‌మంత చీర వ‌ద‌ల‌ట్లేదేంటి?!

By:  Tupaki Desk   |   28 Nov 2015 11:30 AM GMT
స‌మంత చీర వ‌ద‌ల‌ట్లేదేంటి?!
X
తెలుగులో మొద‌ట్నుంచీ స‌మంత‌ని ట్రెండీగానే చూపెడుతున్నారు ద‌ర్శ‌కులు. ఆమె చీర‌క‌ట్టుతోనే తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైనా, ఆ లుక్కుతోనే ఆక‌ట్టుకున్నా ఎందుకో మ‌న‌వాళ్లు ట్రెండీగానే చూపించ‌డానికే ఇష్ట‌ప‌డుతున్నారు. అయితే త‌మిళ్ ద‌ర్శ‌కులు మాత్రం ఇటీవ‌ల స‌మంత‌ని చీర‌క‌ట్టుకే ప‌రిమితం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. రాబోయే సినిమాల్లో ఆమె అన్నీ మెచ్చూర్డ్ క్యారెక్ట‌ర్ లే పోషిస్తున్న‌ట్టు స‌మాచారం.

ధ‌నుష్‌తో క‌లిసి న‌టిస్తున్న తంగ‌మ‌గ‌న్‌ లో స‌మంత చీర‌లోనే ద‌ర్శ‌న‌మిస్తుంది. అలాగే సూర్య‌తో క‌లిసి న‌టిస్తున్న 24లోనూ చీరే క‌ట్టింది. అందుకు సంబంధించిన స్టిల్స్ కూడా ఇటీవ‌ల బ‌య‌టికొచ్చాయి. ఇక విజ‌య్‌ తో క‌లిసి న‌టించ‌నున్న కొత్త సినిమాలోనూ ఆమె ఇల్లాలిగా క‌నిపించ‌బోతోంద‌ట‌. ఇల్లాలి పాత్ర అంటే చీర‌లోనే క‌దా క‌నిపించేది. అంతే కాదు.. ఆమె ఓ పాప‌కి త‌ల్లిగా కూడా ద‌ర్శ‌న‌మివ్వ‌బోతోంద‌ని స‌మాచారం. పాప పాత్ర‌ని మీనా కూతురు పోషిస్తోంది.

చూస్తుంటే త‌మిళంలో స‌మంత‌ని అప్పుడే ఆంటీగా మార్చేశారనిపిస్తోంది. అయితే తెలుగులో మాత్రం ఆమెకి ప‌డుచు పిల్ల పాత్ర‌లే ద‌క్కుతున్నాయి. `మ‌నం`లో మాత్రం కాసేపు చీర‌క‌ట్టుతో సంద‌డి చేసిందంతే. అయినా ఇలా ఒక్కో చోట ఒక్కో ర‌కంగా క‌నిపించ‌డం మేలేలెండి. త‌మిళంలో తెర‌కెక్కుతున్న చాలా సినిమాలు తెలుగులోనూ విడుద‌ల‌వుతుంటాయి. ఇలా వేరియేషన్స్‌తో కూడిన పాత్ర‌ల్లో క‌నిపించ‌డంవ‌ల్ల ప్రేక్ష‌కుల‌కూ కొత్త‌ద‌నాన్ని పంచిన‌ట్ట‌వుతుంది.