Begin typing your search above and press return to search.

రెచ్చిపోవడంలో ఇంచ్ కూడా తగ్గట్లేదే

By:  Tupaki Desk   |   25 Feb 2017 5:41 AM GMT
రెచ్చిపోవడంలో ఇంచ్ కూడా తగ్గట్లేదే
X
టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత సౌత్ అంతా చెలరేగిపోయేందుకు బాగానే ప్లాన్లు గీసింది కానీ.. పెద్దగా వర్కవుట్ అయిన బాపతు తక్కువే. అలాగని తన ప్రయత్నాలకు మిడిల్ డ్రాప్ ఇచ్చేసే బాపతు కాదు ఈ బ్యూటీ. పెళ్లి సెట్ అయింది కదా అని.. తన ట్రయల్స్ ను తగ్గించుకునే రకం కూడా కాదు.

కెరీర్ బాగా ఊపందుకున్నాక.. సమంత ఇచ్చిన బిగ్గెస్ట్ గ్యాప్ ఇదే. చైతుతో పెళ్లి పనుల్లో భాగంగా దాదాపు ఆరు నెలలు ఖాళీగా గడిపేసిన సమంత.. ఇప్పుడు ఫుల్లు బిజీ అయిపోతోంది. అటు పెళ్లి పనులతో పాటు.. ఇటు సినిమాలను కూడా సేమ్ టైమ్ హ్యాండిల్ చేయాల్సి వస్తోంది. అనీతి కథైగళ్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఓ తమిళ సినిమా కోసం.. తెగ రెచ్చిపోతోంది సమంత. ఓ మూవీని శామ్ అడాప్ట్ చేసుకుందంటే.. ఇక ఏ రేంజ్ లో ప్రచారం చేస్తుందో చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడీ తమిళ మూవీ కోసం కూడా రోజుకో టైపులో రెచ్చిపోతోంది సమంత. ఈ గెటప్ లో అమ్మడు ఇలా కనిపించడం కొత్తా కాదు కానీ.. ఈసారి క్లోజప్ షాట్ కావడం.. క్లీవేజ్ అందాలను ఆరబోయడంలో తన స్టైల్ చూపించేసింది శామ్. పరిస్థితులు ఎటు నుంచి ఎటు మారినా.. సమంత మాత్రం తన స్టైల్ లోనే గ్లామర్ మెయింటెయిన్ చేయగలగడం మాత్రం చెప్పుకోవాల్సి విషయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/