Begin typing your search above and press return to search.

సమంత ఒక్క రోజు వస్తే చాలు

By:  Tupaki Desk   |   17 Aug 2017 8:17 AM GMT
సమంత ఒక్క రోజు వస్తే చాలు
X
మంచి కథకు ఒక స్టార్ నటిస్తే ఆ కథ మరింత పాపులర్ అవుతుంది. కానీ చాలాసార్లు కథ బాగున్న స్టార్కి కూడా నచ్చిన డేట్స్ కుదరక చేయలేక వదిలేసిన సినిమాలు చాలానే ఉంటాయి. ఇప్పుడు నటులు హీరోలు డేట్స్ కన్నా స్టార్ హీరోయిన్లు డేట్స్ దొరకడం అంటే కష్టమైన పనిగా మారింది. ఎందుకంటే ఒకేసారి రెండు మూడు సినిమాలలో నటిస్తూ ఉంటారు మన హీరోయిన్లు. సౌత్ ఇండియాలో ఇప్పుడు సమంత ఎంత బిజీ హీరోయిన్ అందరికీ తెలిసిందే. తన పెళ్లి నాగ చైతన్య తో ముడిపడినప్పటి నుండి సమంత అటు సినిమాలతోను ఇటు ఫ్యామిలి ఈవెంట్లు తోను బాగ బిజీ అయ్యింది. అంతే కాకుండా కొన్ని తెలుగు, తమిళ్ సినిమాలు ఒకేసారి షూటింగ్ చేస్తుంది.

అయితే నాగార్జున హీరోగా నటిస్తున్న రాజు గారి గది2 అనే హారర్ కామిడీ సినిమాలో సమంత కూడా నటిస్తుంది. ఈ సినిమా విడుదల తేది కూడా ఫిక్స్ చేసేశారు. రాజు గారి గది 2 సినిమా అంతా అయిపోయినా ఇంకా సమంత పై కొన్ని సన్నివేశాలు మిగిలే ఉన్నాయి అంటా. ఒక్క రోజు షూటింగ్కి వచ్చినా చాలు ఈ షూటింగ్ పూర్తి అయిపోతుందిని రాజు గారి గది టీమ్ చెబుతున్నారు. వాళ్ళు చెబుతున్నా దాని ప్రకారం సమంత ఒకే సారి తమిళ్ తెలుగులో నటిస్తుండడం వలన డేట్స్ కుదరటం లేదు అంటా. సినిమాలే కాకుండా మిగతా బ్రాండింగ్ పనులు కూడా ఉన్నాయి కదా వీటి అన్నింటి మధ్య డేట్స్ కుదరటం కష్టం అవుతుంది అని వివరణ ఇచ్చారు. రాజు గారి గది 2 అక్టోబర్ 13న విడుదలవుతుంది.

ఓంకార్ డైరెక్ట్ చేసిన రాజు గారి గది సినిమా విజయవంతం కావడంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది ఈ రాజు గారి గది 2. ముందు సినిమాలో నటించన అశ్విన్ బాబు, శకలక శంకర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. నాగార్జున అక్కినేని హీరోగా చేస్తున్న ఈ సీక్వెల్లో సీరాత్ కపూర్, సమంత లీడ్ రోల్స్ చేస్తున్నారు. పి‌వి‌పి సినిమా నిర్మిస్తున్న ఈ సినిమాకు యెస్ యెస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.​