Begin typing your search above and press return to search.

టాలీవుడ్డంతా యాపిల్ బ్యూటీ మయం

By:  Tupaki Desk   |   26 Aug 2016 10:30 PM GMT
టాలీవుడ్డంతా యాపిల్ బ్యూటీ మయం
X
టాలీవుడ్ జనతా గ్యారేజ్ హంగామా భీకరమైన స్టేజ్ కి చేరుకుంటోంది. వరుసగా రెండు సార్లు కెరీర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తాడన్నది అభిమానుల ఆశ. పైగా ఈ చిత్రానికి ఇద్దరు హీరోలకు కెరీర్ బెస్ట్ ప్లస్ ఇండస్ట్రీ రికార్డుల్లో స్థానం పొందిన సినిమా తీసిన కొరటాల శివ దర్శకుడు కావడం ప్రత్యేక ఆకర్షణ అనాల్సిందే. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకొచ్చి భారీతనాన్ని మరింతగా పెంచేశారు.

జనతా గ్యారేజ్ లో ఇన్నేసి అట్రాక్షన్స్ ఉన్నా.. సమంత అందాల డోస్ ని స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిందే. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ అని ఎన్టీఆర్ అడుగుతుంటే.. పక్కన అందాల ఆరబోతలో.. రెచ్చిపోయి మరీ చేసేసింది సమంత. అసలు శామ్స్ ఇంతలా పొట్టి బట్టలు వేసుకుందా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కల్పించేసింది. ఇప్పుడా పాటలో సమంత గెటప్ ని.. డ్రస్సులను.. సోకులను.. సోయగాలను.. జనతా గ్యారేజ్ విపరీతంగా వాడేస్తోంది కూడా.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ప్రధానమైన సెంటర్లలో సమంత ఆరబోసిన అందాలతో నిండిపోయాయంటే.. ఈ పాటలో అమ్మడి డ్రెసింగ్ కానీ.. అందులో ధారపోసిన సోకుల రేంజ్ కానీ అర్ధమవుతుంది. మొత్తానికి ట్యాలెంటెడ్ బ్యూటీనే కాదు.. హాట్ హీరోయిన్ అనిపించుకోవడం కూడా తనకు పెద్ద విషయమేం కాదని.. ప్రూవ్ చేసేస్తోంది సమంత. టాలీవుడ్ అంతా.. ఆ మాటకొస్తే మూవీ లవర్స్ అంతా సమంత అందాల గురించి మాట్లాడేయాల్సిన పరిస్థితి కల్పించేసిందిగా!