సమంత పేరు మార్చేసుకుందిగా..

Wed Oct 11 2017 18:30:02 GMT+0530 (IST)


ఓ నాలుగు రోజుల క్రితం అఫీషియల్ గా పెళ్ళి చేసుకుని తమ ప్రేమకథ ను కొత్త స్థాయికి తీసుకెళ్ళారు లవ్ బర్డ్స్ నాగ చైతన్య అండ్ సమంత. అయితే ఈ పెళ్లి తరువాత అసలు సమంత తన ఇంటి పేరును అందరిలాగానే మార్చుకుంటుందా లేకపోతే పాస్ పోర్టులో ఉన్న పేరునే కొనసాగిస్తుందా అనే సందేహం చాలామందికి ఉంది. అయితే సమంత మాత్రం.. తనకు కొత్తగా వచ్చిన కోడలు స్టాటస్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది.అదిగో అక్కడ చూడండి.. ఇప్పుడు సమంత తన ట్విట్టర్ ఎకౌంటులో పేరును మార్చేసుకుంది. మొన్నటివకు సమంత్ రుత్ ప్రభు అని ఉన్న ఆమె పేరును ఇప్పుడు ''సమంత అక్కినేని'' అని మార్చుకుంది. ఈ దెబ్బతో ఒక్కసారిగా తెలుగువారు చాలామంది ఈ తమిళమ్మాయ్ ఇక మా ఇంటి ఆడపడచు అన్నట్లు ఫీలైపోతున్నారు. మొత్తానికి సమంత కూడా ఆ విధంగా అక్కినేని కుటుంబంలో భాగమైపోయి.. శాశ్వతంగా ఒక తెలుగు హీరోయిన్ గా స్థిరపడిపోయిందనే చెప్పాలి. అంత పవర్ ఫుల్ సర్నేమ్ సొంతమైతే అలాగే ఉంటుందిలే.

సినిమా విషయానికొస్తే.. ఈ శుక్రవారం రిలీజయ్యే ''రాజు గారి గది 2'' సినిమాలో సమంత అమృత అనే లాయర్ పాత్రలో కనిపిస్తోంది. అయితే ఆ పాత్ర చనిపోయి ఆత్మగా మారిపోయి.. ఆ తరువాత ఎటువంటి సీన్లు క్రియేట్ చేస్తుంది అనేదే సినిమా. కాని క్లయమ్యాక్స్ భాగంలో మామయ్య నాగార్జున తో కలసి సమంత పండించే ఎమోషనల్ సీన్లు చాలా బాగా వచ్చాయని అంటున్నాడు దర్శకుడు ఓంకార్. వెయిట్ అండ్ సి.