సుచీలీక్స్ ను సమంతను కూడా భాదించింది

Thu Oct 12 2017 23:08:36 GMT+0530 (IST)


ఆ మధ్య కాలంలో సుచీ లీక్స్ గురించి ఎంత పెద్ద రచ్చైందో తెలిసిందే. సింగర్ సుచిత్ర ట్విట్టర్ ఎకౌంటును ఎవరో హ్యాక్ చేసి.. కొన్ని ఎమ్మెమ్మెస్ వీడియోలను రిలీజ్ చేసి.. ఇంకొంతమంది నటీనటుల వీడియోలను రిలీజ్ చేస్తాం అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాని చివరకు ఎలాగొలా ఇష్యూ సెటిల్ అయిపోయింది. అయితే ఈ ఇష్యూలో స్టార్ హీరోయిన్ సమంత పేరు రాలేదు కదా.. కాని ఆమెను బాధించడమేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం.

ఇప్పుడు 'రాజు గారి గది 2' సినిమాతో పలకరించనుంది సమంత. ఈ సినిమాలో ఈమె చేసే క్యారెక్టర్ గురించి చెబుతూ.. ''అప్పట్లో ఒక లీక్స్ ఒకటి వచ్చి.. అందిరినీ చాలా ఇబ్బంది పెట్టింది. పైగా అందులో కొందరి పేర్లున్నాయి. ఆ వీడియోల వలనా వాటిని చాలామంది సర్కులేట్ చేయడం వలన.. సదరు వ్యక్తులు ఎంతగా బాధింపడ్డారో తెలుసా? ఇప్పుడు అదే విషయం మీకూ అర్ధమవుతుంది. ఆ బాధితులు పడిన బాధనే ఈ సినిమాలో నా క్యారక్టర్ ద్వారా చెబుతున్నాం'' అంటూ కామెంట్ చేసింది. అలాంటి ఒక లీక్స్ అంటే అది ఖచ్చితంగా సుచి లీక్స్ అనే అందరికీ అర్ధమవుతుందిలే.

చూస్తుంటే సుచీ లీక్స్ గొడవ సమంతను కూడా బాగా ఇబ్బందిపెట్టినట్లు ఉంది. పైగా అప్పట్లో సమంత స్నేహితురాలు.. సింగర్ చిన్మయి కూడా ఈ సుచీ లీక్స్ విషయంలో బాగా బాధపడి.. అందరికంటే ముందే ఓపెన్ గా స్పందించింది. ధనుష్ వంటి హీరోలు ఈ విషయం గురించి అడిగితే టివి స్టూడియోల నుండి బయటకు వెళిపోయారు కాని.. సమంత మాత్రం సరైన ఆన్సర్ ఇస్తోందనమాట.