చర్చి మెట్లపై సమంత!!

Fri Jan 12 2018 12:59:06 GMT+0530 (IST)

టాలీవుడ్ బ్యూటీ సమంతకు దైవ చింతన ఎక్కువే. రీసెంట్ గానే అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న ఈ భామ.. ఒకవైపు సినిమాలను పూర్తి చేస్తూ..మరోవైపు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీగా గడిపేస్తున్న సమంత.. టైం దొరికితే చర్చిలను కూడా సందర్శించేస్తూ ఉంటుంది.గతంలో చెన్నైలో గడిపిన ఈ భామ.. ప్రస్తుతం హైద్రాబాద్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. మరి రెగ్యులర్ గా వెళ్లేందుకు ఓ చర్చిని ఎంచుకోవాలి కదా.. అలా హైద్రాబాద్ లోని తిరుమలగిరిలో ఉన్న ఆల్ సెయింట్స్ ను ఎంచుకున్న సామ్.. అక్కడకు వారానికి మూడు సార్లు వెళుతోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పిన సమంత..     అక్కడి మెట్లపై దిగిన ఓ ఫోటోను కూడా అభిమానులకు చూపించింది. అయితే.. ఇలా చర్చికి రావడంపై తనకు గతంలో ఉన్న చిన్ననాటి కొన్ని జ్ఞాపకాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది ఈ భామ. చిన్నపుడు చర్చికి వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడకపోతే.. తన తల్లి బలవంతంగా లాక్కు వెళ్లేదని అంటోంది సామ్.

'అపుడు అమ్మ చెపినపుడు అర్ధం కాకపోయినా.. ఇపుడు మాత్రం అమ్మ చేసిన ప్రార్ధనల కారణంగానే నేను ఈ స్థాయిలో ఉండగలిగానని అర్ధమవుతోంది. మా అమ్మ ఓ అద్భుతం' అంటోంది సామ్. రామ్ చరణ్ కు జోడీగా సమంత నటించిన మూవీ రంగస్థలం.. మార్చ్ 30న విడుదల కానుండగా.. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది సమంత.