Begin typing your search above and press return to search.

అవార్డు సమంతకి.. అందాలు అభిమానులకి

By:  Tupaki Desk   |   26 Sep 2016 5:25 AM GMT
అవార్డు సమంతకి.. అందాలు అభిమానులకి
X
సౌత్ బ్యూటీ సమంత చాలా రోజులు మీడియా ఫోకస్ నుంచి పక్కకు తప్పుకుందని అనిపించింది కానీ.. ఓ నాలుగు రోజులుగా మాత్రం తెగ చక్కర్లు కొట్టేస్తోంది. పలు షాపుల ఓపెనింగులు.. రిబ్బన్ కటింగులు.. కొత్త కలెక్షన్ లాంఛింగులతో మహా హడావిడి పడిపోతున్న సమంత.. ఆదివారం సాయంత్రం ఓ పెద్ద ఈవెంట్ లో సందడి చేసింది.

రిట్జ్ అవార్డు వేడుకలు చెన్నైలో జరగగా.. ఈ ఈవెంట్ లో సమంత హాట్ హాట్ లుక్స్ తో కనిపించింది. సాధారణంగా ఇలాంటి ఫంక్షన్స్ కు ఫ్యాషనబుల్ గా హాజరయ్యే సమంత.. బ్లాక్ డ్రస్ లో క్లీవేజ్ షో చేస్తూ హాట్ కిల్లర్ లుక్స్ తో కనిపించేసింది. ఈ ఫంక్షన్ లో చాలా మందే ఉన్నా.. శామ్ చూపించిన సోకుల ముందు మిగతా వాళ్లు కళ్లకు ఆనలేదంటే నమ్మక తప్పదు. సమంతను ఇలా చూసి పెళ్ళికి దగ్గరపడే కొద్దీ సమంత ఏంటీ.. అందాలతో ఘాటుగా ఎరవేస్తోంది. అస్తమించే సూర్యుడు ఆఖరి పది నిమిషాల్లో ఎర్రటి కిరణాలను చాలా ఆహ్లాదకరంగా చూపిస్తూ డ్యూటీ నుండి సెలవు తీసుకున్నట్లు.. సమంత కూడా రిటైర్ అవ్వబోయే ముందు ఇలా మెరుపులు మెరిపిస్తోందా? అనుకుంటున్నారు.

ఈ రిట్జ్ సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అవార్డుల్లో భాగంగా 'సౌత్ ఇండియాస్ మోస్ట్ అడ్మైర్డ్ ఫ్యాషన్ ఐకాన్' అవార్డును అందుకున్న సమంత అందం ముందు.. ఆ అవార్డు చాలా చాలా చిన్నదిగా అనిపించింది లెండి.