Begin typing your search above and press return to search.

సమంత హీరోయిన్.. సిమ్రాన్ విలన్

By:  Tupaki Desk   |   21 Jun 2017 7:37 AM GMT
సమంత హీరోయిన్.. సిమ్రాన్ విలన్
X
ఒకప్పుడు హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన వాళ్లు.. ఆ తర్వాత అక్క.. వదిన.. తల్లి పాత్రలకు మళ్లడం మామూలే. ఐతే హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ అవతారం ఎత్తడం మాత్రం అరుదే. ఒకప్పటి కలల సుందరి సిమ్రాన్.. ఇప్పుడు ఆ బాటలోనే సాగబోతోంది. ఆమె ఓ తమిళ సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించనుంది. ‘ఎదిర్ నీచిల్’ సినిమాతో మొదలుపెట్టిన వరుస బెట్టి హిట్లు కొడుతున్న రైజింగ్ స్టార్ శివ కార్తికేయన్ సినిమాలో సిమ్రాన్ విలన్ రోల్ చేస్తుండటం విశేషం.

పొన్ రామ్ అనే కొత్త దర్శకుడితో శివ కార్తికేయన్ ఓ సినిమా చేస్తున్నాడు. అందులో సమంత కథానాయిక కావడం విశేషం. ఇటీవలే ఆ చిత్రం మొదలైంది. శివకార్తికేయన్ తో రెండు సినిమాలు నిర్మించిన 24 ఎం.ఎం.స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో సిమ్రాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.

మరి తన అంద చందాలతో ఓ దశాబ్దం పాటు దక్షిణాది ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపిన సిమ్రాన్ ఇప్పుడు నెగెటివ్ రోల్ తో ఎలాంటి అనుభూతిని పంచుతుందో చూడాలి. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాక పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ సిమ్రాన్.. ఎంతో కాలం సినిమాలకు దూరంగా లేదు. మళ్లీ వెనక్కి వచ్చి ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’.. ‘ఆహా కళ్యాణం’.. ‘త్రిష ఇల్లాన నయనతార’ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/