Begin typing your search above and press return to search.

ఆ డాక్టర్ గారితో నవ దంపతులు

By:  Tupaki Desk   |   9 Oct 2017 5:00 AM GMT
ఆ డాక్టర్ గారితో నవ దంపతులు
X
అక్కినేని నాగచైతన్య.. సమంత పెళ్లి అంగరంగ వైభవంగా గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. మొదట హిందూ వివాహ పద్ధతిలోనూ.. మరుసటి రోజున క్రైస్తవ వివాహ వేడుకగాను జరిగిన ఈ పెళ్లికి.. దగ్గుబాటి.. అక్కినేని.. సమంత కుటుంబాల నుంచి మాత్రమే అతిథులు హాజరయ్యారు. ఇప్పుడీ పెళ్లికి సంబంధించిన ఒక్కో ఫోటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

ఇప్పుడు సమంత తన ''ప్రత్యూష్ ఫౌండేషన్''ను నడపడంలో ముఖ్యపాత్రను పోషిస్తున్న డాక్టర్ మంజుల అనగానితో దిగిన ఫోటో బహు చూడముచ్చటగా ఉంది. హైదరాబాదులో ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ మంజుల ప్రత్యూష్ ఫౌండేషన్ ను ముందుండి నడిపిస్తుంటారు. గతంలో ఆవిడ స్థాపించిన ట్రెండ్ సెట్టర్స్ అనే ఎన్.జి.ఓ సంస్థ కూడా చాలా పేరుగాంచింది. ఈమె ఎక్కువగా మీడియా ముందు కనిపించరు కానీ.. సమంత పెళ్లి వేడుక అన్నాక.. ఆవిడ ఎలా రాకుండా ఉంటారు. సమంత అండ్ చైతన్యతో కలిసి ఇలా ఫోటోకు పోజ్ ఇచ్చారు.

ఇకపోతే చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ను సెలబ్రిటీస్ ను సమంత పెళ్ళికి పిలుస్తుంది అనుకుంటే.. కేవలం సింగర్ చిన్మయి.. హీరో రాహుల్ రవీంద్రన్.. కమెడియన్ వెన్నెల కిషోర్.. మరో హీరో అడివి శేష్‌ తప్పించి.. ఈ ఈవెంటుకు ఎవ్వరికీ ఆహ్వానం అందలేదు. వారందరూ మరి రిసెప్షన్ లో మెరుస్తారేమో చూడాలి.