Begin typing your search above and press return to search.

శృతి కత్తి యుద్దం.. సమంత కర్రసాము

By:  Tupaki Desk   |   20 April 2017 4:18 AM GMT
శృతి కత్తి యుద్దం.. సమంత కర్రసాము
X
శృతి హాసన్ అండ్ సమంతలు కాంపిటీషన్ లో నువ్వానేనా అనే రేంజు నటీమణులు. పైగా ఇద్దరి మధ్యనా కూడా కొన్ని వైరాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన ఓపెన్ టాపిక్. సిద్దార్ద్ తో శృతి బ్రేకప్ అయ్యాక.. సమంత అతడితో ప్రేమాయణం సాగించింది. అలాగే నాగచైతన్య కూడా శృతిని పక్కనెట్టేసి సమంతతో డేటింగ్ స్టార్ట్ చేశాడని రూమర్లు అనేక రూమర్లు విన్నాం. ఇప్పుడిక ప్రొఫెషనల్ విషయాలకు వస్తే.. ఇద్దరూ ఒకేసారి కొన్ని ప్రాచీన క్రీడలను మొదలెట్టడం కాస్త సర్పరైజింగ్ గా ఉంది.

సంఘమిత్ర సినిమా కోసం ఆల్రెడీ లండన్ లో కత్రియుద్దాలు నేర్చుకోవడం మొదలెట్టింది శృతి హాసన్. ఆల్రెడీ ఆమె కత్తితో చేస్తున్న విన్యాశాల తాలూకు వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు సమంత కూడా అలాంటి ఓ ప్రాచీన క్రీడను స్టార్ట చేసింది. మన భారతదేశంలో ఎప్పటినుండో ఉన్న కర్రసాముతో ఇప్పుడు అమ్మడు అలరిస్తోంది. మరి రామ్ చరణ్‌ తో చేస్తున్న సినిమాలో ఏదన్నా అవసరం వచ్చిపడిందేమో తెలియదు కాని.. సమంత మాత్రం కేవలం హాబీగా కర్రసాము చేస్తున్నాను అంటోంది. ఈరోజు ఉదయం అమ్మడు పోస్టు చేసిన ఈ వీడియో చూస్తే మాత్రం.. ఔరా అనిపించకమానదు.

ఇకపోతే పోలవరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ముగించుకుని వచ్చిన సమంత.. ఇక జిమ్ లోనే ఎక్కువగా గడుపుతోంది. షూటింగ్ సమయంలో బాగా ఒళ్ళు చేయడంతో.. ఇప్పుడు కరిగించే పనిలో పడిందట.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/