Begin typing your search above and press return to search.

బంతితో సమంత కుమ్మేస్తోంది

By:  Tupaki Desk   |   18 Aug 2017 11:41 AM GMT
బంతితో సమంత కుమ్మేస్తోంది
X
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి తన కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ వెళుతున్న భామ సమంత. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో మంచి హిట్ అందుకొని ఆ తర్వాత ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. తనకు నచ్చిన కథలన్నిటినీ చేసుకుంటూ వెళ్ళింది. ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత త్వరలో అక్కినేని ఇంట్లో కోడలిగా అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.

ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే సమంత సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అనుభవాలను-ఆలోచనలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే రీసెంట్ గా సమంత షేర్ చేసిన ఓ విడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఆమె కాస్త క్యాలరీలు బర్న్ చేసుకోవడానికి జిమ్ లో చాలా కష్టపడి వర్కౌట్స్ చేస్తోందట. ఓ బంతితో ఆమె చేస్తున్న వ్యాయామం బలే కొత్తగా ఉందంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సింగిల్ హ్యాండ్ పుషప్స్ ఇలా ఆసక్తికరంగా చేస్తోందిలే. ఇక పెళ్ళికి కూడా కొద్దీ రోజులే సమయం ఉండడంతో సమంత ఎంత బిజీగా ఉన్నా కాసేపు వ్యాయామం చేయాల్సిందే అంటోందట. సమంత చేస్తున్న తీరును చూస్తుంటే అక్కినేని అభిమానులకు కూడా సమంత జిమ్ వర్కౌట్స్ స్ఫూర్తినిస్తోందనే కామెంట్స్ వినబడుతున్నాయి.

ప్రస్తుతం సమంత రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న వస్తున్న రంగస్థలం 1985 చిత్రంతో పాటు తన మామయ్య సినిమా అయినా రాజుగారి గది-2 సినిమాలతో తెలుగులో బిజీగా ఉంది. అలాగే సావిత్రి బయోపిక్ మరియు ఇతర తమిళ సినిమాల్లో కూడా సమంత లీడ్ క్యారెక్టర్స్ చేస్తోంది.