Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ : సమంతా క్యామ్ లో వెంకీ ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   23 April 2019 11:52 AM GMT
ఫోటో స్టొరీ : సమంతా క్యామ్ లో వెంకీ ఫ్యామిలీ
X
మజిలీ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న సమంతా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే . నాగ చైతన్య కన్నా తనే ఎక్కువగా అప్ డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇటీవలే వెంకీ కూతురి పెళ్లి సందర్భంగా చైతు సామ్ ల జంట ఎంత అల్లరి చేసిందో చూసాంగా. స్వయానా చైతు మేనమామ కూతురి పెళ్లి కావడంతో అక్కినేని జంట సందడి మాములుగా లేదు.

తాజాగా వెంకీ ఫ్యామిలీ స్పెషల్ ఫోటో ఒకటి సామ్ షేర్ చేసుకుంది. చైతు లేకుండా కేవలం తను మాత్రమే ఉన్న ఆ పిక్ లో వెంకీని తప్ప ఇతర కుటుంబ సభ్యులను గుర్తించడం కూడా కష్టమే అనేలా ఉంది. సాధారణంగా వెంకీ తన కుటుంబానికి సంబంధించిన పిక్స్ ని షేర్ చేసుకోడు. ఇప్పుడు కూడా కూతురి పెళ్లి కాబట్టి ఇన్నేసి మెమొరీస్ బయటికి వచ్చాయి కాని లేదంటే చూసే భాగ్యం దక్కేది కాదు

ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ షూటింగ్ లో చైతుతో కలిసి బిజీగా ఉన్నాడు. ప్రేమమ్ లో క్యామియో తర్వాత వెంకీ నాగ చైతన్యతో కలిసి చేస్తున్న ఫుల్ లెంత్ మూవీ ఇదే. దసరాకు విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. మజిలితో కొత్త ఏడాదిలో బోణీ కొట్టిన చైతు దీని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

మరోవైపు సామ్ ఓ బేబీ రిలీజ్ కోసం వెయిట్ చేయడంతో పాటు 96 రీమేక్ రెగ్యులర్ షూటింగ్ కోసం రెడీ అవుతోంది. ఇది కాకుండా మన్మధుడు 2 ఓ కీలకమైన పాత్ర కూడా ఒప్పుకుంది. మొత్తానికి వెంకీ ఇంట పెళ్లి సందడి వైరల్ కావడంలో ఈ రకంగా సామ్ కూడా తన వంతు పాత్ర పోషించిందన్న మాట.