Begin typing your search above and press return to search.

ఆ జోకు మాకూ చెప్పచ్చుగా సమంతా!

By:  Tupaki Desk   |   1 July 2016 1:48 PM GMT
ఆ జోకు మాకూ చెప్పచ్చుగా సమంతా!
X
టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత సైమా అవార్డు వేడుకల్లో సందడి చేసేసింది. వైట్ అండ్ వైట్ లో బుట్టబొమ్మలా తయారై వచ్చిన ఈ బ్యూటీ.. ఇండస్ట్రీలోని కుర్ర హీరోలు, స్టార్ హీరోలతో కలిసి హంగామా చేసి పారేసింది. అసలు శామ్స్ ఎక్కుడుంటే అక్కడ నవ్వులు పూస్తూనే ఉంటాయి. అలాంటి అల్లరి సమంతకు.. అటు బన్నీ.. ఇటు రానా చేరితే! ఇక ఆ గోల తట్టుకోలగమా?

సైమాలో యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డును అందుకుంది సమంత. ఈ అవార్డును అందుకునే ముందు ఓ సరదా సంఘటన జరిగింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. భల్లాలదేవుడు దగ్గుబాటి రానాల మధ్యలో సెటిల్ అయింది సమంత. బేసిక్ గా ఈ ముగ్గురూ మాంచి జోవియల్ పర్సన్స్. ఒక్కొక్కరూ వేసే పంచ్ లకు పొట్ట పట్టుకుని నవ్వుకోవాల్సిందే. ఇక ముగ్గురూ ఒక చోటకు చేరేసరికి.. ఆ జోక్స్ పీక్స్ కి వెళ్లిపోయాయి. రానా, బన్నీలు వేస్తున్న జోకులకు కళ్లు మూసుకుని మరీ కిలకిలా నవ్వేస్తోంది సమంత.

వాళ్లేం జోక్ చేశారో.. శామ్స్ ఎందుకు నవ్వుతోందో చెబితే మనమూ కాసేపు నవ్వుకుంటాం కదా. అది సరే కానీ.. నీ నవ్వులు జోకులు బాగానే ఉన్నాయ్ కానీ.. కొత్త సినిమాల సంగతి మాత్రం శామ్స్ తేల్చడం లేదు. చేతిలో ఉన్న ప్రాజెక్టులు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త సినిమా యాక్సెప్ట్ చేయడంలేదు. ఓ సారి ప్రేమ-పెళ్లి లాంటి మాటలు చెప్పి తర్వాత గప్ చుప్ అయిపోవడం.. ఇప్పుడు సినిమాలకు ససేమిరా అంటే.. ఫ్యాన్స్ ఫీలవుతున్నారు శామ్స్.. కాస్త ఫ్యాన్స్ సంగతి కూడా ఆలోచించి క్లారిటీ ఇవ్వచ్చు కదా బ్యూటీ!