Begin typing your search above and press return to search.

అవి సమంత పెళ్లి డ్రస్సుల కాదంట

By:  Tupaki Desk   |   23 Sep 2017 6:32 AM GMT
అవి సమంత పెళ్లి డ్రస్సుల కాదంట
X
సౌత్ బ్యూటీ సమంత ఇప్పుడు కేవలం గ్లామరస్ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. తెలుగు వారికి కాబోయే కోడలు కూడా. అక్కినేని వారి కోడలుగా మారేందుకు.. మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో.. సమంత డ్రెసింగ్ పై ఓ విచిత్రమైన టాక్ మొదలైంది.

రీసెంట్ గా సమంత బ్రైడల్ వేర్ తో ఓ ఫోటో షూట్ చేసింది. ఇందులో సామ్ బోలెడంత గ్లామర్ గా కనిపించింది. ఇలాంటి ఫోటోషూట్స్ చేయడం ఈ భామకు కొత్తేమీ కాదు కానీ.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. సమంత ఓ కామెంట్ చేసింది. బ్రైడల్ వేర్ డిజైన్స్ లో.. ఆ డిజైనర్ గొప్పదనాన్ని చెబుతూ.. తన పెళ్లి డిజైన్ల కోసం అందుకే ఇదే డిజైనర్ ను ఎంపిక చేసుకున్నానని చెప్పింది. ఈ విషయాన్ని అపార్ధం చేసుకున్న కొందరు.. విచిత్రంగా సమంత పెళ్లిలో ఇలాంటి బట్టలు కట్టుకుంటుందా.. పెళ్లిలో సాంప్రదాయంగా ఉండాల్సింది పోయి.. ఇలాం క్లీవేజ్ లు కనిపించే దుస్తులు వేసుకుంటుందా అంటూ రకరకాల కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

అయినా.. ఫోటో షూట్స్ లో వేసే డిజైన్స్ ను రియల్ లైఫ్ లో వేసుకునేంతగా.. పైగా మ్యారేజ్ లాంటి ట్రెడిషనల్ అకేషన్స్ లో వేసుకునేంతగా మన కల్చర్ లో ఇంకా మార్పులు రాలేదు. ఈ మాత్రం మినిమం పాయింట్ ను మిస్ అయిన కొందరు.. ఇలాంటి దుస్తులు పెళ్లిలోనా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఏదో డిజైనర్ గురించి సమంత చెప్పేందుకు ట్రై చేస్తే.. అది కొందరికి ఇలా అర్ధమైంది. అయితే అవి సమంత పెళ్లి డిజైన్లు కావు.. కేవలం ఆ డిజైనర్ క్రియేట్ చేసిన కొత్త డ్రస్సుల కలక్షన్ అంతే.