ఫ్యాన్స్ కు సమంతా డబల్ ధమాకా

Mon Aug 13 2018 12:19:32 GMT+0530 (IST)

సమంతా తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా టాప్ హీరోయిన్.  తెలుగు తమిళం మాత్రమే కాకుండా సౌత్ అంతా పాపులర్.   నాగ చైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడలయినా నటనను కంటిన్యూ చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతోంది.  ప్రస్తుతం సెట్స్ పై కూడా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి.   ఇదిలా ఉంటే సమంతా త్వరలో ఫ్యాన్స్ ఆడియన్స్ కు డబల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.సమంతా నటించిన రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానున్నాయి. అందులో ఒకటి తమిళ డబ్బింగ్ సినిమా 'సీమ రాజా' కాగా రెండోది 'U టర్న్'.  ఈరెండు సినిమాలు సెప్టెంబర్ 13 న రిలీజ్ అవుతాయి.  ముందుగా 'U- టర్న్' గురించి మాట్లాడుకుంటే..  కన్నడ సూపర్ హిట్ సినిమా 'U టర్న్' కు రీమేక్ గా తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ కు తెలుగులో కూడా సేమ్ టైటిల్ పెట్టారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆది పినిసెట్టి రాహుల్ రవీంద్రన్ భూమిక చావ్లా ఇతర కీలక పాత్రల్లో నటించారు.

మరోవైపు 'సీమరాజా' శివకార్తికేయన్ హీరోగా పొన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ కామెడి ఎంటర్టైనర్. ఈ సినిమాను తమిళంతో పాటుగా తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.  సో.. అటు ఒక సస్పెన్స్ థ్రిల్లర్.. ఇటు ఒక కామెడీ ఎంటర్టైనర్ తో సమంతా రెడీ అవుతోంది.. మీరు డబల్ ట్రీట్ కు రెడీనా?