Begin typing your search above and press return to search.

బికినీ ఫోటో షేర్ చేసిన సమంత

By:  Tupaki Desk   |   29 May 2017 9:11 AM GMT
బికినీ ఫోటో షేర్ చేసిన సమంత
X
నిజంగానే... మీరు చదివింది అక్షరాలా నిజమే.. సమంత వాస్తవంగానే బికినీ ఫోటో షేర్ చేసింది. అక్కినేని నాగచైతన్యతో పెళ్లి ఫిక్స్ అయి.. నిశ్చితార్ధం అయిపోయాక అందాల డోస్ లో సమంత జోరు తగ్గుతుందని అంతా భావించారు కానీ.. తాను ఎప్పటి స సమంతనే అని ఇప్పటికే పలుమార్లు చెప్పిన శామ్.. మరోసారి అదే విషయాన్ని ప్రూవ్ చేసింది.

ఓ బికినీ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో.. అది వైరల్ అయిపోయింది. కాకపోతే.. మిగిలిన బికినీ ఫోటోలను.. సమంత షేర్ చేసిన ఫోటోకు తేడా ఏంటంటే.. ఈ బికినీ సమంతదే అయినా.. అందులో సమంత మాత్రం లేదు. అంటే తను బికినీ వేసుకుని ఫోటోకు పోజ్ ఇవ్వడం కాకుండా.. జస్ట్ తన బికినీని మాత్రం ఫోటో తీసి షేర్ చేసింది సమంత. త్వరలో సమంత ఫారిన్ టూర్ వెళ్లబోతోంది.

ఫోటోలో చూపించిన మెటీరియల్ ను గమనిస్తే బికినీ బీచ్ లో ఎంజాయ్ చేయబోతున్నానని చెప్పిన సామ్.. అక్కడి నుంచి బికినీ పిక్స్ షేర్ చేయడం లేదని ఇన్ డైరెక్టుగా చెప్పినట్లుగా ఉంది ఈ ఫోటో. ఇలాంటి ఫోటో షేర్ చేయడంపై ఓ వ్యక్తి కాసింత క్లాస్ పీకితే.. తిరిగి చాచిపెట్టికొట్టిన రేంజ్ లో సమంత ఆన్సర్ ఇవ్వడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/