Begin typing your search above and press return to search.

ఒకేసారి రెండు కావాలంటున్న రామ‌ల‌క్ష్మీ

By:  Tupaki Desk   |   23 April 2018 12:13 PM GMT
ఒకేసారి రెండు కావాలంటున్న రామ‌ల‌క్ష్మీ
X
రంగ‌స్థ‌లం సినిమా భారీ విజ‌యం సాధించి... మెగా ప‌వ‌ర్ స్టార్ కి బోలెడంత ఇమేజ్ నీ పెంచింతే... పల్లెటూరి తెలుగ‌మ్మాయిగా న‌టించిన స‌మంత‌కి లెక్క‌లేనంత మంది అభిమానుల‌ను తెచ్చిపెట్టింది. ఇక సినిమా అవ‌కాశాలంటారా... అవెప్పుడూ ఉండేవి. పెళ్ల‌య్యాక సామ్ జోరు త‌గ్గుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ రామ‌ల‌క్ష్మీ ప్లానింగ్ మాత్రం వేరేలా ఉంది.

వ‌చ్చే నెల‌లో సామ్ సినిమా సంద‌డి మరింత పెరిగేలా ఉంది. రెండు రోజుల తేడాతో రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు రెఢీగా ఉంది అక్కినేని స‌మంత‌. కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషించిన ‘మ‌హాన‌టి’ సినిమాలో జ‌ర్న‌లిస్టు మ‌ధుర‌వాణిగా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది స‌మంత‌. ఈమెకి జోడిగా టాలీవుడ్ సెన్సెష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడు. మ‌హాన‌టి మే 9న విడుద‌ల‌కు సిద్ధ‌మవుతోంది. ఆ త‌ర్వాత మే 11న ‘అభిమ‌న్యుడు’గా తెలుగు తెర మీదకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు విశాల్‌. త‌మిళంలో ‘ఇరుంబుతురై’ పేరుతో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో అభిమన్యుడితో పేరుతో విడుద‌ల చేస్తున్నారు. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ డేటా చోరీ ప్ర‌ధాన క‌థ‌గా రూపొందిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ త‌మిళ‌నాడులో స‌మ్మె కార‌ణంగా ఇన్నాళ్ల‌కు విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాలో ర‌తీదేవి అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది సామ్‌.

ఇక్క‌డ విశేషం ఏమిటంటే సామ్ న‌టించిన రెండు సినిమాలూ... ఒకేసారి తెలుగు- త‌మిళ‌ రెండు భాష‌ల్లోనూ విడుద‌లవుతుండ‌డం. ఇదీ కాక మ‌రో మూడు సినిమాల‌తో మ‌హా బిజీగా ఉందీ ముద్దుగుమ్మ‌. అందులో త‌న శ్రీ‌వారు అక్కినేని నాగ‌చైత‌న్య‌తో ‘నిన్ను కోరి’ ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా కూడా ఉంది. ఈ సినిమాకి ‘ప్రేయ‌సి’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.