Begin typing your search above and press return to search.

సమంత పక్కన బ్లూ టిక్ పడింది

By:  Tupaki Desk   |   12 Feb 2016 4:25 PM GMT
సమంత పక్కన బ్లూ టిక్ పడింది
X
సౌత్ సుందరి సమంత సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్. సమాజ సేవలోనూ సైలెంట్ గా సర్వీస్ చేసే ఈ సుందరాంగి.. ఈ మధ్య ఎందుకనో తెలీదు కానీ సోషల్ సైట్లలో కనిపించడం లేదు. అలాగని ఈమె ఫాలోయింగ్ కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ప్రస్తుతం శామ్స్ కి 19లక్షల 70వేల మంది ట్విట్టర్ ఫాలోయర్స్ ఉన్నారు.

అల్లు అర్జున్ కి కోటి మంది ఉన్నారు.. ఇక్కడ 20 లక్షలు కూడా లేదుగా ఫిగర్ అనుకోవచ్చు కానీ.. ఈ నెంబర్ చాలా ఎక్కువ. ఎందుకంటే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న ఫాలోయర్ల సంఖ్య 18 లక్షలు. మహేష్ కంటే ఎక్కువగా సమంతను ట్విట్టర్ లో జనాలు ఫాలో అవుతారన్న మాట. అయితే.. ఇంత ఫాలోయింగ్ ఉంది కానీ.. ఇదే సమంత అకౌంట్ అనేందుకు ఇప్పటివరకూ ఎలాంటి ఫ్రూఫ్ లేదు. అంటే.. @samanthaprabhu2 అనే అకౌంట్ నిజంగా సమంత దే అనేలా వెరిఫై చేయలేదు. ఇప్పుడు మాత్రం సడెన్ గా సమంత ట్విట్టర్ అకౌంట్ పక్కన ఓ బ్లూ టిక్ వచ్చి చేరింది.

అంటే.. ఇప్పుడిది అధికారికంగా సమంతదే అని ట్విట్టర్ కన్ఫాం చేసిందన్న మాట. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇప్పటివరకూ శామ్స్ నుంచి ఒక్క ట్వీట్ కూడా పడలేదు?­ పోనీ ఆ అకౌంట్ తనదే అని వెరిఫై చేశాక ట్వీట్ చేద్దామని సమంత అనుకుందని.. మనం అనుకందామంటే ఇప్పుడు కూడా ట్వీట్ చేయడం లేదు. ఈ సమంతకేమైంది? ఎవరూ ప్రశ్నించరెందుకని ?