Begin typing your search above and press return to search.

సమంత స్పీడు వామ్మో!

By:  Tupaki Desk   |   28 Oct 2016 5:06 PM GMT
సమంత స్పీడు వామ్మో!
X
అ..ఆ.. సినిమా రిలీజ్ తర్వాత సమంత ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. జనతా గ్యారేజ్ తర్వాతయినా.. కాస్త కుదురుకుని సినిమా చేస్తుందంటే ఆ దారిన కూడా పోలేదు. తన రేంజ్ కి తగిన రోల్స్ రావట్లేదంటూ.. తెలుగు సినిమాలయితే ఒప్పుకోలేదు కానీ.. తమిళంలో మాత్రం విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీకి శామ్స్ అంగీకరించగా.. ఇప్పటికే ఆ చిత్రానికి ఇరుంబు తిరాయ్(ఇనుప తెర అని అర్ధం) అనే టైటిల్ ఫైనల్ చేశారు.

అసలీ సినిమాకి సమంత సైన్ చేసిందే ఆగస్ట్ నెల చివర్లో కాగా.. షూటింగ్ ను ఈ నెల ప్రారంభంలో మొదలు పెట్టారంతే. ఇప్పుడు హఠాత్తుగా ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందంటూ సమంత పెట్టిన ట్వీట్ హాట్ టాపిక్ అయిపోయింది. 'ఇరుంబు తిరాయ్ మొదటి షెడ్యూల్ పూర్తయింది. పీఎస్ మిత్రన్(దర్శకుడు ).. జార్జ్ (సినిమాటోగ్రాఫర్) లు సూపర్ ట్యాలెంటెడ్' అంటూ ట్వీట్ చేసింది సమంత. అసలు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. అశలు సమంత ఎప్పుడు షూటింగ్ కి అటెండ్ అయిందా అనే. కానీ కాస్త గ్యాప్ తీసుకుందేమో.. కొత్త అందంతో నిగనిగలాడిపోతోంది శామ్స్.

విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో విలన్ గా కోలీవుడ్ హీరో ఆర్య నటిస్తుండడం విశేషం. థ్రిల్లర్ జోనర్ లో ఇరుంబు తిరాయ్ రూపొందుతుండగా.. ఈ చిత్రాన్ని విశాల్ స్వయంగా నిర్మిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/