సామ్ ఫోటోపై ఫ్యాన్స్ గొడవ

Wed Sep 26 2018 14:45:04 GMT+0530 (IST)

సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉన్నా తాము పెడుతున్న ఫోటోలు పోస్టుల పట్ల స్పందనల ఎలా ఉంటున్నాయని తెలుసుకోవడం చాలా అవసరం. అంతా బాగున్నప్పుడు సమస్య ఉండదు కానీ ఒకే విషయమై రెండు రకాల అభిప్రాయాలూ వ్యక్తమైనప్పుడే అసలు సమస్య. సమంతాకు అలాంటి పరిస్థితే వచ్చి పడింది. ప్రస్తుతం విదేశాల్లో చైతుతో హాలిడే సీజన్ ని ఎంజాయ్ చేస్తున్న సామ్ అక్కడ తాను ఆస్వాదిస్తున్న క్షణాలను ఫోటోల రూపంలో పోస్ట్ చేస్తోంది.ఇవాళ రెడ్ కలర్ లో ఉన్న సెమి బికినీలో స్టిల్ ఇచ్చిన సమంతాకు దానికి మిశ్రమ స్పందన రావడం ఒకరకంగా షాక్ అనే చెప్పాలి. ఆ డ్రెస్ అసలు నప్పలేదని కొందరు పెళ్లయ్యాక ఇలాంటివి అవసరమా అని మరికొందరు ఎవరికి తోచినట్టు వారు అభిప్రాయాలు కామెంట్స్ లో పోస్ట్ చేయటం మొదలుపెట్టారు. అలా అని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేక కాదు. మరోవైపు తను ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెప్పే హక్కు మనకెక్కడిదని కొందరు సామ్ వైపు వచ్చేసారు. గతంలో ఇలాంటి ఫోటోని పోస్ట్ చేసినప్పుడు వచ్చిన కామెంట్స్ కు స్పందించిన సమంతా పెళ్లయ్యాక ఎలా ఉండాలో నిర్దేశించే పద్ధతికి స్వస్తి పలకాలని ఇంతకు ముందే చెప్పింది. ఇప్పుడైనా అదే సమాధానమే వచ్చే అవకాశం ఉంది.

ఇటీవలే సామ్ చేసిన యుటర్న్ యావరేజ్ ఫలితం అందుకోగా తమిళ్ లో సీమ రాజా ప్లాప్ అయ్యింది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో వరుసగా మూడు సూపర్ హిట్స్ అందుకున్న సామ్ శివ నిర్వాణ దర్శకత్వంలో చైతుతో ఓ సినిమా చేస్తుండగా నందిని రెడ్డి డైరెక్షన్ లో మిస్ గ్రానీ అనే కొరియన్ రీమేక్ లో నటించే అవకాశాలున్నట్టు టాక్. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.