Begin typing your search above and press return to search.

సమంతకు మూడ్నెళ్ళ ఇంటర్వెల్

By:  Tupaki Desk   |   23 May 2017 10:00 AM GMT
సమంతకు మూడ్నెళ్ళ ఇంటర్వెల్
X
టాలీవుడ్ యంగ్ లవర్స్ అక్కినేని నాగచైతన్య- సమంతల నిశ్చితార్ధం అయినప్పటి నుంచి పెళ్లిపీటలు ఎప్పుడు ఎక్కుతారంటూ చాలామంది అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ ఏడాది అక్టోబర్ లో ఈ జంట ఒక్కటి కానుంది. ఈ విషయం నాగచైతన్య ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. నాగచైతన్య ఇప్పటికే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమా మే 26న విడుదల కానుంది. దీంతో నాగచైతన్యకు పెళ్లిపనులకు కాస్త వీలు చిక్కినట్టే.

సమంత సౌత్ ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్. తన చేతిలో ఇంకా పూర్తి చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత తను మూడు నెలలు బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉంది. దీంతో ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు తొందరగా పూర్తి చేయాలని అనుకుంటోంది. కాబోయే మామగారితో సమంత కలిసి నటిస్తున్న ‘రాజుగారి గది-2’ లో ఇప్పటికే తన పోర్షన్ ను పూర్తి చేసింది. ఇంకా సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో సమంతే హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. దీంతోపాటు అలనాటి నటి సావిత్రి జీవితకథతో వస్తున్న ‘మహానటి’ సిినిమాలోనూ సమంత నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి సమంత నటించాల్సిన పార్ట్ పెళ్లికి ముందే పూర్తి చేసే ఆలోచనలో ఉంది. దీనికితోడు మరికొన్నితమిళ సినిమాల్లోనూ సమంత నటిస్తోంది.

పెళ్లితో నటనకు గుడ్ బై చెప్పే ఆలోచనమీ లేదని... పెళ్లి తర్వాత కూడా నటిస్తానని సమంత చెబుతోంది. కాకుంటే పెళ్లి తర్వాత ఓ మూడు నెలలు బ్రేక్ తీసుకుంటానని అంటోంది. సెప్టెంబర్.. అక్టోబర్.. నవంబర్.. ఈ మూడు నెలలూ బ్రేక్. తన సినిమాలకు ఇది ఇంటర్వెల్ అన్నమాట. కొత్త అసైన్మెంట్స్ ఏమైనా పెళ్లి తర్వాతే ఓకే చేయనుంది. సమంతతో షూటింగ్ ప్లాన్ చేసిన వారంతా వారి పని వేగవంతం చేయాల్సి ఉంటుంది. లేకుంటే వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.