సమంత సర్టిఫికెట్ ఇచ్చేసింది

Mon Mar 19 2018 09:16:48 GMT+0530 (IST)

హీరోయిన్ సమంత కెరీర్ రంగస్థలం సినిమా చాలాచాలా స్పెషల్. ఎందుకంటే తన ఇన్నాళ్ల కెరీర్ లో పీరియాడికల్ ఫిలిం చేసింది.. పూర్తి పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్ చేసింది రంగస్థలంలోనే. ఈ సినిమాలో డీ గ్లామర్ గా కనిపించినా కూడా ఎంత సక్కగున్నావే రామలక్ష్మి అనిపించింది.రంగస్థలం లాంటి మూవీలో చేయడమే తన అదృష్టమని ఆనందంగా చెప్పుకొచ్చింది సమంత. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంతా అచ్చ తెలుగులో మాట్లాడుతూ అందరినీ మెప్పించింది. ‘‘డైరెక్టర్ సుకుమార్ చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా షూటింగ్ టైంలో రామలక్ష్మి క్యారెక్టర్ గురించి ఆయన చెబుతున్నప్పుడల్లా ఆయన మాట వినలేదు. ఆయన కళ్లల్లో చూసేదాన్ని. ఆయన రామలక్ష్మి క్యారెక్టర్ ఎంత ప్రేమించి తీర్చిదిద్దారా అనిపించింది. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలని నిజంగా చాలా కష్టపడ్డాను. ఆయన గర్వపడేలా నటించాననే అనుకుంటున్నాను’’ అంటూ సమంత ఈ సినిమాలో తన రోల్ ఎంత స్పెషలో చెప్పుకొచ్చింది.

‘‘మెగాస్టార్ చిరంజీవికి స్వయం కృషి ఎంత స్పెషలో.. చరణ్ కు రంగస్థలం అలా పేరుతెస్తుంది. కొన్నేళ్లపాటు చిట్టిబాబు అనే పేరు గుర్తుండిపోతుంది. నేను పనిచేసిన హీరోల్లో హానెస్ట్.. జెన్యూన్.. కేరింగ్ రామ్ చరణ్ ఒకడు.’’ అంటూ చరణ్ కు సమంత మంచి సర్టిఫికెట్ ఇచ్చింది.