Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ వచ్చారు, సినిమా హిట్ -సమంత

By:  Tupaki Desk   |   2 May 2016 4:59 PM GMT
పవర్ స్టార్ వచ్చారు, సినిమా హిట్ -సమంత
X
టాలీవుడ్ సమంత రేంజ్ ని అందుకోవడం ఏ హీరోయిన్ కి అయినా చాలా కష్టం. అమ్మడు స్క్రీన్ పై కనిపిస్తే చాలు హిట్ అనే సెంటిమెంట్ దీనికి అసలు కారణం. ఒకటీ అరా సినిమాలు ఈ సెంటిమెంట్ ని దెబ్బకొట్టినా.. సమంత స్థాయి మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు నితిన్ కి జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అ..ఆ.. ఆడియో ఫంక్షన్ లో తన స్పెషాలిటీ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది సమంత.

అసలు లుక్ తోనే శామ్స్ ఆకట్టుకుంది. ఆడియో ఫంక్షన్ల విషయంలో ఈ చెన్నై సుందరికి ఓ అలవాటు ఉంది. బొడ్డు కనిపించేలా డ్రసింగ్ చేసి, నాభికి ఓ డైమండ్ స్టడ్ ని తగిలించి, అందరి చూపు అక్కడే ఉండేలా జాగ్రత్తపడుతుంది. గతంలో చాలా ఫంక్షన్లలో ఇలా కనిపించినా.. అ..ఆ విషయంలో మాత్రం దీన్ని బ్రేక్ చేసింది. అయితే క్లీవేజ్ అందాలు - నాభి సొగసుల ప్రదర్శన మాత్రం కామన్ గానే కంటిన్యూ చేసింది. సింపుల్ గా చెబ్తే తన సొగసులతో అందరినీ ఆకట్టుకుంది.

అ..ఆ.. ఆడియో ఫంక్షన్ లో సమంత తెలుగులో మాట్లాడ్డం ఆకట్టుకుంది. పెద్ద స్పీచ్ రాసుకుందామని అనుకున్నా కుదర్లదన్న సమంత.. ఈ సినిమా గురించి చెబితే, తనను తాను పొగుడుకున్నట్లే అని, కుటుంబసభ్యుల గురించి ఎక్కువ చెబుతామా అని క్వశ్చన్ చేసింది. సినిమా మంచి సక్సెస్ కావాలని, నిర్మాతకు డబ్బులు రావాలని.. అందరికీ విషెస్ చెప్పిన శామ్స్.. చివర్లో పవన్ గురించి ఓ మాట చెప్పి అదుర్స్ అనిపించింది. 'అన్నిటికీ మించి మమ్మల్ని బ్లెస్ చేయడానికి పవర్ స్టార్ వచ్చారు.. సినిమా హిట్ అంతే' అంటూ తన స్పీచ్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది సమంత.