Begin typing your search above and press return to search.

స్కిన్‌ షో కోసం కాదులే -సమంత

By:  Tupaki Desk   |   6 May 2016 4:31 AM GMT
స్కిన్‌ షో కోసం కాదులే -సమంత
X
హీరోయిన్ల రోల్‌ ఏంటి? ఇద్దరు హీరోయిన్లు ఎందుకు ఉన్నారు? పాటలు కాకుండా ఏం చేశారు? ఇలా తమిళ మీడియా మన సమంతమైన అందం సమంతను చాలా ప్రశ్నలే అడిగింది. ఈరోజు రిలీజవుతున్న ''24'' సినిమా గురించే ఈ ప్రకటనల్నీ. అసలు ఈ సినిమాలో మీ రోల్‌ ఎలా ఉండబోతోంది అని అడిగితే.. సమంత ఏమంటుందో తెలుసా?

''24 సినిమా కథ వినగానే ఈ రోల్‌ నేను చేసేయాలి అనే అనిపించింది. చాలా అందంగా కథతో పాటు హీరోయిన్ల క్యారెక్టర్‌ అనేది ట్రావెల్‌ చేస్తుంటుంది. కథలో ఒక భాగం. కేవలం ఏదో స్కిన్ షో కోసం నా పాత్ర కాని.. నిత్యా మీనన్‌ పాత్ర కాని డిజైన్‌ చేయలేదు దర్శకుడు విక్రమ్‌. తనలో ఆల్రెడీ మనం సినిమాలో వర్క్‌ చేశాను కాబట్టి.. నాకు తెలుసు ఎలాంటి పాత్రను డిజైన్‌ చేస్తాడో. మీరు స్ర్కీన్‌మీద చూస్తే థ్రిల్‌ అవుతారు'' అంటోంది సమంత. ఒక తమిళ న్యూస్‌ డైలీకి ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయం చెప్పుకొచ్చింది.

ఇప్పటికే 24 సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు వస్తున్న దరిమిళా.. మరి సమంత మాటలు కూడా నిజమై ఆమెకు కూడా మాంచి పేరొస్తే.. అంతకంటే ఇంకేం కావాలి. కాసేపట్లో మన రివ్యూ కూడా వచ్చేస్తుంది.. గెట్ రెడీ!!