Begin typing your search above and press return to search.

రామలక్ష్మికి మాటలు వస్తాయిరో

By:  Tupaki Desk   |   18 March 2018 6:53 AM GMT
రామలక్ష్మికి మాటలు వస్తాయిరో
X
రామ్ చరణ్-సుక్కు కాంబోలో వస్తున్న రంగస్థలం షూటింగ్ దశలో ఉన్నప్పుడే హీరోకు చెవులు వినపడవని, హీరొయిన్ కు మాటలు రావని గట్టి ప్రచారమే జరిగింది. దానికి బలం చేకూర్చేలా టీజర్ లో చిట్టుబాబుకి వినిపించదని చెర్రితోనే చెప్పించడంతో ఒక డౌట్ క్లియర్ అయ్యింది. సహజంగానే సమంతా పాత్ర విషయంలో వచ్చిన న్యూస్ నిజమే కావొచ్చు అనుకున్నారు ఫాన్స్. గలగలా మాట్లాడుతూ ప్రతి సినిమాలో సందడి చేసే సమంతా ను ఇంత స్పెషల్ మూవీలో సైలెంట్ గా ఉంటే ఎలా చూడాలబ్బా అని అభిమానులు తెగ వర్రీ అయ్యారు. కాని ఇక వాళ్ళు టెన్షన్ పెట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే రంగస్థలం రామలక్ష్మికి మాటలు వస్తాయట. అది ఇవాళ సాయంత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విడుదల కానున్న ట్రైలర్ లోనే చూడోచ్చట.

ఇప్పుడు బయటికి వచ్చిన ఒక డైలాగ్ ఫాన్స్ మధ్య బాగా వైరల్ అవుతోంది. ‘ఏం సోమరాజు కళ్ళలో ప్రేమ కనిపించింది కాని నా కళ్ళలో ప్రేమ కనిపించలేదా’ అంటూ సమంతా చెర్రిని నిలదీసే సీన్ హై లైట్ గా ఉండబోతోందని టాక్. ఈ సోమరాజు ఎవరా అనే డౌట్ రావడం సహజం. చరణ్ తో పాటు అతని అసిస్టెంట్ గా అంటిపెట్టుకున్న పాత్రలో శతమానంభవతి మహేష్ నటించాడు కదా. సోమరాజు అతని పేరే అని ఇన్ సైడ్ టాక్. సోమరాజు మీద ఎంతో అభిమానం చూపించే చిట్టిబాబుని ఈ విషయంగానే రామలక్ష్మి నిలదీస్తుందని సమాచారం. సో మూగ సమంతా ఎలా చూడాలిరా అని మధన పడుతున్న ఫాన్స్ ఇక రిలీఫ్ కావొచ్చు.

సాయంత్రం జరగనున్న ప్రీ రిలీజ్ కోసం సకలం సిద్ధం అయ్యింది. చిరంజివి రావడం కన్ఫర్మ్ అయ్యింది కాని అతిధులు ఇంకా ఎవరెవరు వస్తారు అనే దాని గురించి క్లారిటీ రావాల్సి ఉంది. విడుదలకు కేవలం 12 రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్ దూకుడు పెంచేలా మైత్రి సంస్థ ప్లానింగ్ లో ఉంది. సంక్రాంతి సీజన్ తర్వాత మళ్ళి భారీ సినిమాల సందడి రంగస్థలంతోనే మొదలు కానుంది