Begin typing your search above and press return to search.

చయ్‌.. సమంత.. వాటే రొమన్స్‌

By:  Tupaki Desk   |   30 Aug 2015 6:47 AM GMT
చయ్‌.. సమంత.. వాటే రొమన్స్‌
X
`నీ సినిమా టీజ‌ర్ చూస్తుంటే 2010లోలాగే మ‌రింత‌మంది అమ్మాయిలు మూర్చ వ‌చ్చి ప‌డిపోతార‌నిపిస్తోంది` అంటూ స‌మంత‌. `థ్యాంక్యూ స‌మంత... అయితే నువ్వు మాత్రం ప‌డిపోవ‌డం లేదుగా` అంటూ నాగ‌చైత‌న్య‌. `అయితే నువ్వు ప్ర‌య‌త్నించ‌డం లేదుగా` అని స‌మంత‌. ఈ మాట‌ల‌న్నీ వింటే వీళ్ల మ‌ధ్య స‌రసం పొంగి ప్ర‌వ‌హించిన‌ట్టు అనిపించ‌డం లేదూ! వీళ్లిద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధం అలాంటిది మ‌రి. నాగ‌చైత‌న్య న‌టించిన `సాహ‌సం శ్వాస‌గా సాగిపో` సినిమా టీజ‌ర్ చూశాక స‌మంత ట్విట్ట‌ర్‌ లో పైవిధంగా స్పందించింది. దీంతో వీళ్లిద్ద‌రి మ‌ధ్య కాసేపు స‌రసపు మాట‌లు న‌డిచాయి.

నాగ‌చైత‌న్య సినిమా `ఏమాయ చేసావె`తోనే స‌మంత తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత వీళ్లిద్ద‌రూ హిట్ కాంబినేష‌న్‌ గా గుర్తింపు తెచ్చుకొన్నారు. `ఏ మాయ చేసావె`తో పాటు `మ‌నం`, ఆటోన‌గ‌ర్ సూర్య‌`లాంటి చిత్రాలు చేశారు. మ‌రోసారి క‌లిసి న‌టించే ఛాన్స్ వ‌చ్చింది కానీ స‌మంత కాల్షీట్లు లేక‌పోవ‌డంతో నాగ‌చైత‌న్య మ‌ల‌యాళం ముద్దుగుమ్మ మంజిమ‌తో క‌లిసి న‌టించాల్సి వ‌చ్చింది. గౌత‌మ్‌ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ సినిమా చివ‌రి ద‌శ‌కు చేరుకొంది. నాగార్జున పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ఇటీవ‌లే టీజ‌ర్‌ ని విడుద‌ల చేశారు. `ఏమాయ చేసావె` త‌ర‌హాలోనే ఫ్రెష్‌ గా సాగిపోయే ప్రేమ‌క‌థ‌లా అనిపించింది. టీజ‌ర్‌ ని చూశాక ప‌లువురు సెల‌బ్రిటీలు స్పందించారు. చైత‌న్య మ‌ళ్లీ హిట్టు కొట్టేలా ఉన్నాడ‌ని మాట్లాడుకొన్నారు. స‌మంత కూడా త‌న హీరోకి కాస్త డిఫ‌రెంట్‌ గా కాంప్లిమెంట్స్ ఇచ్చేసింది. మ‌రి స‌మంత జోస్యం చెప్పిన‌ట్టుగానే తెర‌పై నాగ‌చైత‌న్య‌ని చూశాక ఎంత‌మంది అమ్మాయిలు ప‌డిపోతారో చూడాలి. మొత్తంగా వీళ్ల ట్విట్ట‌ర్ చిలిపి క‌బుర్లు భ‌లే ఉన్నాయి క‌దూ!