లిప్పు లాకులపై సమంతా సందేశం ఇదే!

Sat Mar 23 2019 13:44:23 GMT+0530 (IST)

టాలీవుడ్ సినిమాల్లో రోజురోజుకీ పెరిగిపోతున్న కిస్సుల గురించి ఈమధ్య భారీగా చర్చ సాగుతోంది. ఇది యువతను పెడదారి పట్టిస్తుందని సంప్రదాయవాదులు విమర్శిస్తుంటే.. లిబరల్  థింకింగ్ ఉండేవారు మాత్రం మర్డర్లు.. రేపులను సినిమాల్లో చూపిస్తే తప్పు లేదుకానీ కిస్సు  చూపిస్తే మాత్రం పాడవుతారా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఇదో ఎడతెగని చర్చ.  మరోవైపు పెళ్ళైన హీరోయిన్లు సినిమాల్లో లిప్ లాకులకు సై అనడంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 'రంగస్థలం' లో కిస్ ఇచ్చినందుకు స్టార్ హీరోయిన్ సమంతాకు కూడా అప్పట్లో హీట్ తగిలింది.తాజాగా నాగచైతన్య 'మజిలీ' సినిమాలో ఒక లిప్ లాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  ఈ సినిమాలో కొత్త హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ తో చైతు తన లిప్పులను గట్టిగా లాక్ చేస్తాడు. ఇప్పటికే ప్రోమోస్ లో ఈ కిస్ బయటకు రావడం.. వైరల్ కావడం జరిగిపోయాయి.   దీంతో కొంతమంది సమంతా ఫ్యాన్స్.. "పెళ్ళైన తర్వాత సమంతా చేస్తే తప్పు అన్నారు.. మరి పెళ్ళైన తర్వాత చైతు చేస్తే తప్పు కాదా? హీరోయిన్లకు ఒక రూల్.. హీరోలకు మరో రూల్ ఎలా చెప్తారు?" అంటూ లా పాయింట్లు తీస్తున్నారు. ఇదిల ఉంటే.. చైతు - దివ్యాన్షలు లాగించిన దివ్యమైన లిప్ లాక్ గురించి సమంతాను ప్రశ్నిస్తే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది.

"నావరకూ నటించే సమయంలో కిస్ అయినా హగ్ అయినా  ఒకటే.  అది జస్ట్ యాక్టింగ్.  ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది నేనైనా.. చైతు అయినా యాక్టింగ్ లో భాగం మాత్రమే" అంటూ తేల్చేసింది.  తామిద్దరి మధ్య అద్భుతమైన అనుబంధం ఉందని.. ఒక యాక్టర్ గా ఇలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు తమకు ఆ స్వేచ్చ ఉంటుందని తెలిపింది.  అయినా కిస్సులు పెట్టుకునేది వాళ్ళు.. మధ్యలో నెటిజనులు దూరిపోయి ఎందుకు పెట్టుకోవాలి.. ఎందుకు పెట్టుకోకూడదు.. ఎంత సేపు పెట్టుకోవాలి.. ఫ్రెంచ్ కిస్సా లేక ఇండియన్ బీ-గ్రేడ్ కిస్సా అని ఏంటో ఈ చర్చలు.