Begin typing your search above and press return to search.

స‌మంత‌కి రెమ్యున‌రేషన్ ఫిక్స‌య్యింది!

By:  Tupaki Desk   |   28 July 2015 9:55 AM GMT
స‌మంత‌కి రెమ్యున‌రేషన్ ఫిక్స‌య్యింది!
X
త్రివిక్ర‌మ్ సినిమాలో స‌మంత మ‌రోసారి న‌టించ‌బోతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. నితిన్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. నితిన్ స‌ర‌స‌న న‌టించే విష‌యంలో స‌మంత నిర్ణ‌య‌మేమిటో ఇంకా తెలియ‌దు. త్రివిక్ర‌మ్ కూడా స‌మంతని ప‌క్కాగా ఫిక్స్ చేశాడో లేదో స‌మాచారం లేదు. కానీ అప్పుడే స‌మంత రెమ్యున‌రేష‌న్ కోటిన్న‌ర తీసుకుంటుంద‌ట అని చెప్పుకొంటున్నారు. స‌మంత‌లాంటి క‌థానాయిక‌కి కోటిన్న‌ర ఇవ్వ‌డం పెద్ద విష‌య‌మేమీ కాదు కానీ... నితిన్ స‌ర‌స‌న న‌టించేందుకు స‌మంత ఒప్పుకుందా లేదా అన్న‌దే ఇప్పుడు ఇప్పుడు అస‌లు చ‌ర్చ.

త్రివిక్ర‌మ్ అంటే స‌మంత‌కి చాలా ఇష్టం. ఇద్ద‌రూ మంచి స్నేహితులు. త్రివిక్ర‌మ్ సినిమాలో ఛాన్స్ వ‌స్తే స‌మంత ఎట్టిప‌రిస్థితుల్లోనూ మిస్ కాదు. అందుకే నితిన్‌, స‌మంత జోడీ ఖాయం అని ఫిక్స‌యిపోతున్నాయి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు. `అత్తారింటికి దారేది`, `స‌న్నాఫ్ స‌త్యమూర్తి` ఇలా వ‌రుస చిత్రాల్లో స‌మంత‌ని కంటిన్యూ చేశాడు త్రివిక్ర‌మ్‌. మూడోసారి కూడా ఆమెనే ఎంపిక చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నాడ‌ట‌. అయితే మొద‌ట స‌మంత‌నే త‌ట‌ప‌టాయించిన‌ట్టు తెలిసింది. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల‌వ‌ల్ల ఈ సినిమాలో న‌టించ‌క‌పోవ‌డ‌మే మేల‌ని ఆమె భావించిన‌ట్టు స‌మాచారం. అయితే చివ‌రి నిమిషంలో మ‌ళ్లీ మ‌న‌సు మార్చుకొని త్రివిక్ర‌మ్‌ కి ఓకే చెప్పేసింద‌ట. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం స‌మంత త‌మిళంలో బిజీగా గ‌డుపుతోంది. `బ్ర‌హ్మోత్స‌వం` ఒప్పుకొంది కాబ‌ట్టి త్వ‌ర‌లోనే మ‌ళ్లీ హైద‌రాబాద్‌ కి మ‌కాం మార్చ‌బోతోంది. అప్ప‌ట్నుంచి నితిన్, మ‌హేష్ సినిమాల్లో న‌టిస్తూ గ‌డ‌ప‌నుంది. తెలుగులో ఆమె మ‌రిన్ని చిత్రాలు ఒప్పుకొనే అవకాశాలున్నాయని తెలిసింది.