ఫోటో టాక్: అక్కినేని పసి పాపాయి!!

Sun Dec 16 2018 16:14:45 GMT+0530 (IST)

అల్లి బిల్లి కలలా రావే..
అల్లుకున్న కథలా రావే..
అల్లి బిల్లి కలలా రావే..
అల్లుకున్న కథలా రావే..
మల్లె పూల చినుకై రావే..
పల్లవించు పలుకై రావే..
వేచే యెదలో వెలుగై రావే.....అల్లి బిల్లి కలలా రాన..అహ
అల్లుకున్న కథలా రాన..అహ
మల్లె పూల చినుకై రాన..
పల్లవించు పలుకై రాన..
వేచే యెదలో వెలుగై రాన...

`చెట్టుకింద ప్లీడరు` సినిమాలో బాలు పాడిన పాటకు `రాజేంద్ర ప్రసాద్- కిన్నెర` జంట అభినయించిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కొంచెం అమాయకత్వం.. మరికొంచె గమ్మత్తయిన బింకం ప్రదర్శిస్తూ ఆ పాటలో నాయకానాయికలు ఒళ్లు పులకరింపజేస్తారు. ఇదిగో ఇక్కడ సమంత వేషాలు అలానే కనిపిస్తున్నాయ్. అప్పుడే స్కూల్లో చేరిన బుల్లి పాపాయి నేలపై కూచుని పలక - బలపం పట్టుకుని ఏదో గీకుతున్నట్టుగా ఉంది ఈ సీన్. అయితే అంత శ్రద్ధగా సామ్ ఏం చేస్తోంది? అంటే కొత్త సంవత్సరం రాబోతోంది కదా! తనకు ఎంతో ఇష్టమైన వారందరికీ గ్రీటింగ్ కార్డులు పంచి పెట్టబోతోందిట. అందుకు అవసరమైన గ్రీటింగులు కొనుక్కుని వాటి పై ఇప్పటి నుంచే పేర్లు రాసుకుంటోందిలా.

ఇక ఇక్కడ కనిపిస్తున్న  ఫోటో ఫ్రేమ్ లో రకరకాల గెటప్పుల్లో సమంత రకరకాల విన్యాసాలు చేస్తూ మైమరిపిస్తోంది. ఓ ఫోటోలో లిప్స్ కి కలర్ వేస్తూ.. ఇంకో ఫోటోలో టీపానీయం సేవిస్తూ..  వేరొక ఫోటోలో నవ్వులు చిందిస్తూ.. గ్రీటింగ్ కార్డులు చూపిస్తూ రకరకాలుగా ఫోజులిచ్చింది. అన్నట్టు ఒక ఫోటోలో సామ్ ధరించిన పింక్ కలర్ స్వెటర్ షాకిస్తోంది. చినుగుల స్టైల్ వేషధారణతో ఎంతో బుద్ధిగా తాను రంగుల పెన్నుతో గ్రీటింగ్ కార్డు లో నిమగ్నమైంది. టాప్ యాంగిల్ లోని ఆ ఫోటో సంథింగ్ స్పెషల్ గానూ మైమరిపిస్తోంది. ఆ వీపు మీద పచ్చబొట్టు అంతే పెద్ద షాకిస్తోంది. యువర్స్ లవింగ్లీ చై! అంటూ పచ్చబొట్టు పొడిపించుకుందా ఆ వీపుమీద.. అంటూ యూత్ పరిశీలనగా వీక్షిస్తున్నారక్కడ. మొత్తానికి అక్కినేని పసిపాపాయిగా సామ్ ఇన్‌స్టా వేషాలు ఆకట్టుకున్నాయ్.

మరిన్ని ఫొటోస్ కోసం క్లిక్ చేయండి