రిస్క్ వద్దనుకున్న సమంతా

Fri Jan 11 2019 20:00:01 GMT+0530 (IST)

గత ఏడాది బ్లాక్ బస్టర్లు డిజాస్టర్లు సమానంగా అందుకున్న సమంతా మళ్ళి జోరు పెంచుతోంది. పెళ్ళయ్యాక కూడా స్పీడ్ తగ్గించకుండా కెరీర్ ను చాలా పద్ధతిగా ప్లాన్ చేసుకుంటోంది. సాధారణంగా మూడు ముళ్ళు పడ్డాక సహజంగానే హీరొయిన్ల అవకాశాల మీద ప్రభావం పడుతుంది. అయితే సామ్ దీనికి అతీతంగా నిలవడం విశేషం. చేతి నిండా సినిమాలతో డైరీని బిజీగా ఉంచేసుకుంటోంది. ఇక విషయానికి వస్తే నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ కొరియన్ రీమేక్ కు సంబంధించి సమంతా ఓ కీలక నిర్ణయం తీసుకుందట.ముందు అనుకున్న ప్రకారం ఇందులో ఓ వయసు మళ్ళిన బామ్మ ఓ అందమైన పడుచు యువతీ రెండు పాత్రలు తనే చేసేలా మాట్లాడుకున్నారు. అయితే మేకప్ తో పాటు ఇమేజ్ పరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పుడు ఆ ప్రతిపాదన డ్రాప్ అయ్యిందట. అంటే యువతిగా కనిపించే వేషం తనే వేస్తుంది కానీ బామ్మ క్యారెక్టర్ మాత్రం వేరొకరితో చేయిస్తున్నారు.మాజీ హీరోయిన్ కం సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి గారిని ఇందుకు గాను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. సో సమంతా డ్యూయల్ రోల్ లేదని తేలిపోయింది.

నందిని రెడ్డితో పలుమార్లు చర్చలు జరిపాక ప్రొస్తటిక్స్ మేకప్ మగవాళ్ళు తట్టుకుంటారు కానీ అమ్మాయిల నాజూకు చర్మంపై ప్రభావం చూపించే అవకాశం ఉందతని డాక్టర్లు చెప్పడంతో అనవసరమైన రిస్క్ ఎందుకు లెమ్మని లక్ష్మి గారిని సీన్ లోకి తెచ్చినట్టు వినికిడి. ఒరిజినల్ వెర్షన్ లో రెండు పాత్రలు వేర్వేరు ఆర్టిస్టులు చేసారు. ఇందులో నాగ శౌర్య నటిస్తున్నాడు. షూటింగ్ ఫాస్ట్ పేస్ లో జరుగుతున్న ఈ మూవీ మజిలీ విడుదల అయ్యాక వచ్చే అవకాశం ఉంది.