Begin typing your search above and press return to search.

సమంత స్కిన్ గురించి పెద్దాయన ఏమన్నారంటే..

By:  Tupaki Desk   |   20 Oct 2017 9:43 AM GMT
సమంత స్కిన్ గురించి పెద్దాయన ఏమన్నారంటే..
X
ఏ మాయ చేసావే సినిమతో సమంత తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. అలాగే నాగ చైతన్య ఆ సినిమా ద్వారా మొదటి హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఇద్దరి కెరీర్ కి మంచి గుర్తింపును ఇచ్చింది. అలాగే వారి మొదటి ప్రేమ కూడా ఆ సినిమాతోనే మొదలైంది. ఆ తర్వాత మనం సినిమాతో సమంత అక్కినేని ఫ్యామిలీ లో మెంబర్ అయ్యింది.

అక్కినేని కుటుంబం మొత్తం ఆ సినిమాలో ఉండడంతో ఆ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. అదే నాగేశ్వరరావు గారి చివరి సినిమా కూడా. అయితే అప్పట్లో చై - సమంత మొదటి సినిమా ఏ మాయ చేసావే 50 రోజుల వేడుకని చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకకి అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా హాజరయ్యారు. అయితే అప్పుడు ఎఎన్నార్ సమంత కి ఒక మంచి కంప్లిమెంట్ ఇచ్చారట. సమంత దానికన్నా గొప్ప ప్రశంస మరొకటి లేదని అంటోంది. ఆ సినిమాలో నటనకు గాను నాగ చైతన్య కి 49% మార్కులు వేస్తే సమంత కు మాత్రం 51% మార్కులు ఇచ్చారట.

దీంతో మొదటి సినిమాకే లెజండరీ యాక్టర్ నుంచి ప్రశంసలను అందుకోవడంతో సమంత చాలా సంతోషపడిందట. అంతే కాకుండా సమంత అచ్చం మహానటి సావిత్రి తరహా పోలికలు ఉన్నాయని ఆమె యాక్టింగ్ ను గమనిస్తే.. ఆమె కళ్లు ఒక్కటే కాదు ఆమె స్కిన్ టోన్ కూడా సావిత్రి మాదిరిగానే హావభావాలను పలికిస్తోందని చెప్పారట. అప్పుడు నాగార్జున చైతన్య తో పాటు సమంత కూడా ఉన్నారట. ఈ విషయాన్ని సమంత రీసెంట్ గా రాజుగారి గది 2 ప్రమోషన్ లో గుర్తుచేసుకుంది.