Begin typing your search above and press return to search.

పెళ్లి కోసం చరణ్ పై ప్రెజర్

By:  Tupaki Desk   |   22 May 2017 4:47 AM GMT
పెళ్లి కోసం చరణ్ పై ప్రెజర్
X
అక్కినేని నాగ చైతన్య- టాలీవుడ్ బ్యూటీ సమంత పెళ్లి ఎప్పుడో నిశ్చయమైపోయింది. ఈ ఏడాది ప్రారంభంలోనే నిశ్చితార్ధం కూడా పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం తమ ప్రేమలో పరవశించి పోతున్న వీరిద్దరూ.. త్వరలో మూడుముళ్ల కార్యక్రమానికి కూడా దగ్గరవుతున్నారు.

అక్టోబర్ లో చైతు- సమంతల పెళ్లి జరగనుంది. ఈ అక్టోబర్ ముహూర్తం సంగతి నాగచైతన్య స్వయంగా చెప్పాడు కాబట్టి ఇక మార్పు చేర్పులు ఉండకపోవచ్చు. వచ్చిన చిక్కల్లా ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాలతోనే. అక్టోబర్ లో పెళ్లి అంటే.. ఆగస్ట్ చివరకే సమంత అన్ని షూటింగ్స్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ లో పెళ్లి పనులు.. అక్టోబర్ లో పెళ్లి.. అప్పటి నుంచి డిసెంబర్ వరకు హనీమూన్(న్యూయార్క్ అని టాక్).. ఇలా మొత్తం 4 నెలలపాటు సమంత ఫుల్ బిజీగా ఉంటుందన్న మాట. అందుకే ఆగస్ట్ చివరినాటికే తన వంతు షూటింగ్ పూర్తి చేయాలంటూ.. ఇప్పటికే రామ్ చరణ్- సుకుమార్ లకు కూడా చెప్పేసిందట సమంత. అదే ఇప్పడు సుకుమార్-చరణ్ లపై ఒత్తిడి పెంచుతోంది.

దసరా రిలీజ్ అంటూ మొదలైన రామ్ చరణ్ మూవీ.. ప్రస్తుతం నెమ్మదిగానే నడుస్తోంది. ఇప్పటివరకూ ఒక పాట.. కొన్ని సీన్స్ మాత్రమే తీశారు. జూన్ లో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుండగా.. అక్కడి నుంచి 90 రోజులు సమంత అందుబాటులో ఉంటుందన్న మాట. అలాగని 3 నెలలు ఈ సినిమాకే ఇచ్చే అవకాశం లేదు. కోలీవుడ్ లో అనీథి కథైగళ్.. విజయ్ 61లలో కూడా నటిస్తోంది శామ్. వీటిని కూడా ఈ సమయంలోనే పూర్తి చేయాల్సి ఉంది. ఇక మహానటి మూవీ ఇంకా మొదలు కాలేదు కాబట్టి.. ఆ చిత్రం పెళ్లి తర్వాత ప్రారంభించే అవకాశాలున్నాయి.