Begin typing your search above and press return to search.

దాని గురించి స‌మంత ఫీలింగేంటంటే..

By:  Tupaki Desk   |   17 Feb 2017 7:45 AM GMT
దాని గురించి స‌మంత ఫీలింగేంటంటే..
X
అక్కినేని కుటుంబానికి కొత్త కోడలే అయినా... చిత్ర పరిశ్రమకు మాత్రం ఆమె సుపరిచితురాలే. మంచి సినిమాలు వస్తే పొగడటం... చిత్ర బృందాన్ని అభినందించడంలో ఆమె స్పిరిట్ మిగతా వారికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ఎవరో కాదు.. అక్కినేని నాగార్జున పెద్దకొడలు సమంత. త్వరలోనే నాగచైతన్యను వివాహం చేసుకోబోతున్న ఈమెకు అక్కినేని కుటుంబం ఎంత ఇంపార్టెంటో.. దగ్గుబాటి కుటుంబం కూడా అంతే ఇంపార్టెంట్.

సో.. ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన రానా దగ్గుబాటి నటించిన కొత్త మూవీ ‘ఘాజీ’ సినిమాను పొగడ్తలతో ముంచెత్తింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చైతూతో కలిసి చూసేసిన సమంత... ఆ చిత్రానికి బాలీవుడ్.. టాలీవుడ్లో వచ్చిన పాజిటివ్ రివ్యూస్ ను చూసి చాలా ఎగ్జైట్ అవుతోంది. ‘ఈ మధ్య కాలంలో ఏ చిత్రానికి రానంత పొగడ్తలు ‘ఘాజీ’ చిత్రానికి వచ్చాయి. నేను ఇప్పటి వరకు ఇలాంటి వండర్ ఫుల్ రివ్యూస్ ను చదవలేదు. రానా దగ్గుబాటికి.. ఆ చిత్ర బృందానికి నా అభినందనలు’ అంటూ సోషల్ మీడియలో పొగిడేసింది సమంత.

అలానే రానాను అక్కినేని నాగచైతన్య కూడా అభినందించారు ట్విట్టర్లో. కొత్తదనంతో కూడిన ‘ఘాజీ’ మన తెలుగు సినిమా చరిత్రకే గర్వకారణం. రానా మునుముందు ఇంకా మంచి చిత్రాల్లో నటించాలి. ‘ఘాజీ’లాంటి చిత్రాలను నిర్మించే వాళ్లంటే నాకు చాలా ఇష్టం. మొత్తం చిత్ర యూనిట్ కు నా అభినందనలు అన్నాడు చైతూ. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఘాజీ.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో వెయిట్ అండ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/