సమంతవి కూడా అవే ఫీలింగ్సా?

Thu Sep 14 2017 10:40:05 GMT+0530 (IST)

ఒక సినిమా భారం హీరోయిన్ ఎంత వరకూ మోస్తుంది? దీనికి ఒక్కొక్కరి వెర్షన్ ఒక్కోలా ఉంటుంది. కొంతమంది హీరోయిన్స్ అంతా తమ భుజాలపై వేసుకుని కష్టపడగలరు. మరికొందరు తారలు మనకెందుకు వచ్చిన రిస్క్ లే అనుకుంటూ.. స్టార్ స్టేటస్ ఉన్నా గ్లామర్ పాత్ర చేసేసి సైడ్ అయిపోగలరు.

కానీ ఈ విషయంలో ఓపెన్ డిబేట్ అంటే మాత్రం మొదటగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గుర్తుకు రావడంలో ఆశ్చర్యమేం లేదు. రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ AIBతో కలిసి 'యస్ ఐ హ్యావ్ వెజైనా రే' (Coz I Have A Vagina Re) అంటూ ఓ పాటేసుకుని సెన్సేషన్ సృష్టించేసింది. ఇప్పుడిదే పాటను పోస్ట్ చేస్తూ.. టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా ఓ కామెంట్ పెట్టింది. అస్సలు భయం లేకపోవడం అనేందుకు ఓ రూపం ఉంటే.. అది బాలీవుడ్ దివా కంగనానే అనేసింది సమంత. అంటే సమంతవి కూడా అవే ఫీలింగ్సా? హీరోలకు రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు.. హీరోయిన్లకు తక్కువ పారితోషకం ఇస్తున్నారు.. లాంటి భావనలు ఏమైనా ఉన్నాయా అనిపించక మానదు.

కామెంట్ ను సపోర్ట్ చేసినంత మాత్రాన ఇలాంటి ఫీలింగ్స్ ఉండాలా అనుకోవచ్చు. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా విషయంలో.. ఓ పోస్టర్ విషయంలో సమంత చేసిన రచ్చ అస్సలు మర్చిపోకూడదు. పైగా టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే భామల్లో సమంత కూడా ఒకరు. అఆ.. అంటూ సినిమా సక్సెస్ విషయంలో కీలక పాత్ర పోషించగలదు. క్రెడిట్ తీసుకోగలదు కూడా. అయితే.. ఇలాంటి సినిమాలు మన దగ్గర తీసే ధైర్యం చాలా తక్కువ మంది చేస్తారంతే. కంగనాకి లభించినట్లుగా సమంతకు కూడా ఇలాంటి సినిమా ఆఫర్స్ వస్తే.. అపుడు ఇక్కడ జనాలకు అసలు విషయం అర్ధమయేదేమో.