ఫోటో స్టొరీ: సమంతా సిక్స్ మిలియన్ ట్రీట్

Tue Feb 12 2019 22:59:07 GMT+0530 (IST)

బాలీవుడ్ హీరోయిన్లతో పోలిస్తే మన సౌత్ హీరోయిన్లు వెనకబడి ఉంటారని ఒక జనరల్ అభిప్రాయం ఉంది.  నిజానికి కొన్ని సందర్భాల్లో అది నిజమే కదా అని మనక్కూడా అనిపిస్తుంది.  కానీ సమంతా లాంటి మాడరన్ హీరోయిన్ ను చూస్తే మాత్రం మన హీరోయిన్లు ఏ మాత్రం వెనకబడలేదని మనవాళ్ళు కూడా ఈ జెనరేషన్ కు తగ్గట్టే ఉన్నారని అనిపిస్తుంది. ఎంతోమంది సౌత్ హీరోయిన్లు ఉండగా ఒక్క సమంతా పేరే ఎందుకు ఉదాహరణ అంటే పై ఫోటోలే దానికి కారణం.  సామ్ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది.  దానికి తగ్గట్టే రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఫాలోయర్ల సంఖ్య ఆరు మిలియన్లు దాటింది. మరి ఇలాంటి అకేషన్ ను వేరే హీరోయిన్లయితే థ్యాంక్స్ చెప్పి ఊరుకుంటారు. కానీ సామ్.. ఒక హాట్  ఫోటో షూట్ చేసిపారేసి..ఆ ఫోటోలను ఇన్స్టాలో అప్లోడ్ చేసిపడేసింది.  ఆ మూడు ఫోటోలకు "6 మిలియన్.. లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్" అని క్యాప్షన్ ఇచ్చింది.  ఆ వాక్యానికి అర్థం మాకున్న కొద్దిపాటి ఆంగ్ల పరిజ్ఞానం ప్రకారం '6 మిలియన్ టచ్ చేశాను.  మిమ్మల్ని ఆకాశమంత ప్రేమిస్తున్నాను."

ఇక ఫోటోలు హాటు కాబట్టి సహజంగానే నెటిజనులు రెండు రకాలుగా డివైడ్ అయ్యారు.  హాట్.. గార్జియస్.. మైండ్ బ్లోయింగ్.. థ్రిల్లింగ్..ఝకాస్ అని ఒక కేటగిరీ జనాలు పొగిడి చంపేశారు.  పెళ్ళయిన తర్వాత ఇంకా ఈ ఫోటో షూట్లేంటి ఆపు..  మేడమ్ ఇప్పటికే చస్తున్నాం మళ్ళీ ఈ ఫోటోలా.. ఇలా రెండో రకం జనాలు తమకు తోచిన కామెంట్లు పెట్టారు.