Begin typing your search above and press return to search.

కదిలే ఖజానా.. మన సమంతం

By:  Tupaki Desk   |   13 Oct 2015 4:01 AM GMT
కదిలే ఖజానా.. మన సమంతం
X
సమంత.. సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న సుందరీమణుల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటుంది సమంత. ఓ టైంలో వరుసగా తెలుగులోనే చేస్తుంది.. ఓ టైంలో కోలీవుడ్ కే ప్రిఫరెన్స్ ఇస్తుంది. అయినా సరే.. తన ప్లేస్ కి ఇప్పటివరకూ పోటీ లేదు. మూవీస్ లోనే కాదు.. యాడ్స్ లోనూ ఈ భామ ఒలికించే వయ్యారాలు జిల్ జిల్ జిగా అనిపిస్తాయి.

గతంలో కాజల్ అగర్వాల్, తర్వాత తమన్నా భాటియాలను తమ ప్రచార కర్తగా నియమించుకున్న ఖజానా.. ఈ సారి మరో అందాల ఖజానాని తెచ్చుకున్నారు. ఖజానా జ్యూవెలరీకి సమంత బ్రాండ్ అంబాసిడర్. ఈ సుందరి ఇచ్చే ప్రకటనలతో నగలకు అందం వస్తుందో.. ఆ ఆభరణాలతో శామ్ కు మరిన్ని సొగసులు దక్కుతున్నాయో చెప్పడం కష్టమైన విషయం. రీసెంట్ గా మరో ఫోటో షూట్ చేశారు ఈ కంపెనీ వాళ్లు.

హాఫ్ వైట్ ట్రెడిషనల్ డ్రస్ వేసుకుని.. కుందన్ కలెక్షన్ కి ఓ స్పెషల్ లుక్ తెచ్చింది సమంత. మరో ఫోటోలో మెరూన్ కలర్ ఫ్లవర్ డిజైన్ బోర్డర్ ఉన్న వైట్ శారీతో మెరిసిపోతోంది. ఈ శారీకి మ్యాచింగ్ కలర్ నెట్టెడ్ జాకెట్ వేసుకుని.. ఓరకంటితో చూస్తోంది. నన్ను చూడు.. నా నగలను చూడు అన్నట్లుగా లుక్ ఇస్తోంది. ఓ కంట కనిపెట్టండి. ఈ కదిలే ఖజానాని.