Begin typing your search above and press return to search.

ఇంతకు 'ఓ బేబీ' ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   23 May 2019 4:54 AM GMT
ఇంతకు ఓ బేబీ ఎవరో తెలుసా?
X
టాలీవుడ్‌ లోనే కాకుండా తమిళంలో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత పెళ్లి తర్వాత సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలపై ఆమె ఆసక్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే 'యూటర్న్‌' చిత్రంతో నటిగా నిరూపించుకుంది. అయితే యూటర్న్‌ చిత్రం కమర్షియల్‌ గా మాత్రం సక్సెస్‌ ను దక్కించుకోలేక పోయింది. ఇప్పుడు మరో లేడి ఓరియంటెడ్‌ చిత్రాన్ని సమంత ట్రై చేసింది. అదే 'ఓ బేబీ'. తాజాగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఓ బేబీ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.

కొరియన్‌ సెన్షేషనల్‌ మూవీ 'మిస్‌ గ్రానీ'కి రీమేక్‌ గా 'ఓ బేబీ' చిత్రాన్ని తెరకెక్కించారు. మిస్‌ గ్రానీ స్క్రిప్ట్‌ లో పలు మార్పులు చేర్పులు చేసి నందిని రెడ్డి 'ఓబేబీ' చిత్రాన్ని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం కథ మొత్తం ఒక బామ్మ చుట్టు తిరుగుతుంది. ఆ బామ్మ పాత్రలో సీనియర్‌ నటి లక్ష్మి నటించింది. బామ్మ ఒక ఫొటో స్టూడియోకు వెళ్లిన సమయంలో షాకింగ్‌ గా వయసు తగ్గిన అమ్మాయిగా మారిపోతుంది. వయసు తగ్గిన బామ్మ పాత్రలో సమంత కనిపించబోతుంది.

సినిమా మొత్తంలో కూడా లక్ష్మి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. లక్ష్మి పాత్రలోనే సమంత కనిపించబోతుంది. సినిమాలో కనిపించేది ఎక్కువ సమంత అయినా కూడా సినిమా మొత్తం కథ అంతా కూడా లక్ష్మి పాత్ర చుట్టు తిరుగుతుందని తెలుస్తోంది. సురేష్‌ బాబు మరో ముగ్గురు నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుండి వస్తున్న మూవీ అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మంచి టైం చూసి ఈ సినిమాను వదలాలని సురేష్‌ బాబు భావిస్తున్నాడు.