Begin typing your search above and press return to search.

నో మాట.. నో ట్వీట్‌.. వాటే సమంత

By:  Tupaki Desk   |   9 Oct 2015 7:30 AM GMT
నో మాట.. నో ట్వీట్‌.. వాటే సమంత
X
అందాల స‌మంత ఇంటిపై, అతిధి గృహాల‌పై ఇటీవ‌లి కాలంలో ఐటీ సోదాలు సాగిన సంగ‌తి తెలిసిందే. భారీ మొత్తంలో న‌గ‌లు - డ‌బ్బు ప‌ట్టుబ‌డిన సంగ‌తి కూడా తెలిసిందే. చెన్న‌య్‌ - హైద‌రాబాద్‌ లోని ఇళ్ల‌పై ఏక కాలంలో ఐటీ అధికారులు దాడి చేసి ఊపిరి తీసుకోకుండా చేశారు. గత కొన్నేళ్లుగా స‌మంత ఆదాయ ప‌న్ను స‌రిగా చెల్లించ‌డం లేద‌ని ఐటీ అధికారులు ఈ దాడులు చేశారు.

అయితే ఆ టైమ్‌ లో స‌మంత ఎక్క‌డ ఉంది? అస‌లు లోక‌ల్‌ గా లేనేలేదు. సూర్య‌ - విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్‌ లోని 24 సినిమా షూటింగ్ పోలెండ్‌ లో జ‌రిగింది. అక్క‌డ షూటింగు బిజీలో ఉంది. అలాంటి టైమ్ లో ఐటీ అధికారులు దాడులు చేయ‌డంతో అమ్మ‌డు అందుబాటులో లేకుండా పోయింది. స‌మంత త‌ల్లిదండ్రులే అన్నిటినీ మ్యానేజ్ చేయాల్సొచ్చింది. స‌మంత‌కు సంబంధించిన ఏవీ త‌మ వ‌ద్ద లేవ‌ని ఆమె త‌ల్లిదండ్రులు ఐటీ అధికారుల‌కు చెప్పారు. అయితే క‌నీసం పోల్యాండ్ నుంచి రిట‌ర్న్ అయ్యాక అయినా ఈ విష‌యంపై స‌మంత క్లారిటీ ఇస్తుంద‌ని అంతా అనుకున్నారు.

కానీ అనుకున్న‌దొక్క‌టి, అయిన‌దొక్క‌టి అన్న చందంగా స‌మంత ఇండియాకి రిట‌ర్న్ రాగానే అస‌లు ఇంటికే రాలేదుట‌. నేరుగా ఫ్రెండు విద్యురామ‌న్ ఇంటికే వెళ్లి అక్క‌డి నుంచే శికార్లు చేస్తోందిట‌.. ఇటీవ‌లే హైదరాబాద్‌ లో ఓ షాపు రిబ్బ‌న్ క‌టింగుకి కూడా వెళ్లొచ్చింది. మళ్ళీ చెన్నయ్‌ వెళ్లి విద్యురామ‌న్‌ తో క‌లిసి పులి సినిమా చూసొచ్చింది. అక్కడే ధనుష్‌ సినిమా షూటింగ్‌ లో పాల్లొంది. కాని రెయిడ్‌ గురించి ఒక్క మాట కాదు కదా.. చిన్న ట్వీటు కూడా వేయలేదు.