Begin typing your search above and press return to search.

డెసిషన్ మార్చేసుకున్న సమంత

By:  Tupaki Desk   |   1 Jun 2016 1:30 AM GMT
డెసిషన్ మార్చేసుకున్న సమంత
X
సౌత్ బ్యూటీ సమంతకు చాలా విషయాల్లో క్లారిటీ ఉంటుంది. చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు అన్నీ బ్యాలెన్సెడ్ గానే ఉంటాయి మాటలు. తను నవ్వుతూ చెబుతున్నా.. అంతా పక్కాగా రెడీ చేసుకుని మాట్లాడుతున్నట్లే ఉంటుంది. అలాంటి శామ్స్.. ఓ విషయంలో మాట తప్పుతున్నా అని, అప్పుడు తీసుకున్న నిర్ణయం మార్చేసుకున్నానని చెబుతోంది. అది కూడా పర్సనల్ వ్యవహారంలో కావడం ఆశ్చర్యకరం.

మరో రెండు రోజుల్లో విడుదల కానున్న అ..ఆ.. చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సమంత.. తన పెళ్లి విషయంలో కొత్త మాటలు చెబుతోంది. పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాల్లో నటించడం ఖాయమని చెప్పేసింది సమంత. గతంలో ఇదే ప్రశ్న వేసినప్పుడు.. పెళ్లయ్యాక సినిమాలా? సమస్యే లేదు.. నేను పెళ్లి చేసుకున్నాక భర్త - పిల్లలే నాకు సర్వస్వం.. సినిమాలు సహా అన్నీ వదిలేస్తా.. అంటూ తెగ కటింగ్ ఇచ్చేసింది శామ్స్.

ఇప్పుడు డెసిషన్ మార్చుకోవడంలో.. టాలీవుడ్ యంగ్ హీరో అయిన సమంత బాయ్ ఫ్రెండ్ ప్రభావం ఉండొచ్చని ఈజీగా చెప్పేయచ్చు. 'పెళ్లయ్యాక కూడా సినిమాలు చేస్తా. మీరంతా ఏం అడగాలని అనుకుంటున్నారో, ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారో నాకు తెలుసు.. అయినా సరే నేను చెప్పను' అంటూ ఇంకా టీజింగ్ చేస్తూనే ఉంది శామ్స్.