బార్బెక్యూ టూ భీమవరం.. దటీజ్ స్యామ్

Fri Apr 21 2017 22:34:24 GMT+0530 (IST)

కొన్నాళ్ల క్రితం వరకూ సెలబ్రిటీలు అంటే తమ లైఫ్ స్టైల్ ను.. లివింగ్ స్టైల్ ను జనాలకు దూరంగా ఉంచాలని భావించేవారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ట్రెండ్ మారిపోయింది. స్టార్స్ కూడా తెగ యాక్టివ్ గా ఉంటున్నారు. సమంత అయితే ఈ విషయంలో టాప్ ర్యాంక్ కూడా దక్కించేసుకోగలదు.

ప్రస్తుతం సమంత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. నిన్న(ఏప్రిల్ 19న) ఈమె పాత్ర షూటింగ్ కి బ్రేక్ రాగా.. వెంటనే వచ్చి హైద్రాబాద్ లో వాలిపోయింది స్యామ్. అంతేనా తన కాబోయే భర్తతో ఎంచక్కా బార్బెక్యూలు చేయించుకుని ఆరగించేసింది. అవన్నీ ఫోటోలుగా మలిచి ఆన్ లైన్ లో పెట్టేయడమే సమంత స్పెషాలిటీ. చైతు వంట చేయడం.. సమంత హెల్ప్ చేయడం.. వెనక నుంచి మాంచి హగ్ ఇవ్వడం.. అబ్బో ఈ ఫోటోలు చాలానే కబుర్లు చెప్పేస్తున్నాయి.

ఇదంతా చేసి మళ్లీ ఎంచక్కా గోదారి జిల్లాకు వెళ్లిపోయి అక్కడ మళ్లీ ఇవాళ షూటింగ్ చేసేసుకుంటోంది సమంత. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ మూవీ షూటింగ్ భీమవరంలో జరుగుతుంటే.. అక్కడ తన షెడ్యూల్ కంటే కొన్ని గంటల ముందే వచ్చి వాలిపోయి తను ఎంత ప్రొఫెషనల్ అనే విషయాన్ని చూపింది స్యామ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/