ఏయ్ మొండిపిల్లా

Sun Jan 14 2018 12:20:51 GMT+0530 (IST)

అక్కినేని కోడలయ్యాక సమంతా స్పీడ్ తగ్గుతుందేమో అనుకున్నారు కాని ఆ అంచనాలకు భిన్నంగా మరింత స్పీడ్ తో దూసుకుపోతూ షాక్ ఇస్తోంది యాపిల్ బ్యూటీ. సాధారణంగా హీరొయిన్లకు పెళ్లి కావడం ఆలస్యం అవకాశాలు క్రేజ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. కాని ఈ ట్రెండ్ కి భిన్నంగా తన డిమాండ్ ఇప్పట్లో తగ్గేది కాదని ప్రూవ్ చేస్తున్న నాగ చైతన్య బెటర్ హాఫ్ ప్రస్తుతం టీవీ యాడ్స్ ద్వారా బ్రాండ్స్ ప్రమోట్ చేయటంలో తన మార్క్ చూపిస్తోంది. ఇటీవలే జీ తెలుగు ఛానల్ కి అఫీషియల్ బ్రాండ్ ప్రమోటర్ గా ఒప్పందం చేసుకున్న సమంతా ఆ సంస్థ డిజైన్ చేసిన ఎమోషనల్ యాడ్స్ ద్వారా విపరీతంగా ఆకట్టుకుంటోంది. నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే అంటూ ఆత్మవిశ్వాసాన్ని నింపే పాత్రలో సమంతా సూపర్బ్ అనిపించేలా యాడ్స్ డిజైన్ చేసారు.తాజాగా చెన్నై సంస్థ ఎన్ఎసి జువెలర్స్ కోసం సమంతా చేసిన యాడ్ ఎమోషనల్ గా ఉంటూ అందరిని మెప్పిస్తోంది. అన్నయ్య పెళ్ళిలో హడావిడి చేసే చెల్లిగా సాం చాల క్యూట్ గా అందంగా కనిపిస్తోంది. వదిన కోసం అన్నయ్య కొన్న నగలన్నీ చూసుకుంటూ ఇలా నాకెప్పుడైనా తెచ్చావా అని ముద్దుగా అన్నను అడగటం దానికి అతను స్పెషల్ గా తీసుంచిన ఒక నగల గిఫ్ట్ బాక్స్ ను నన్ను వదులుతావా మొండి పిల్లా అంటూ ప్రేమగా చేతికి ఇవ్వడం తర్వాత వదిన ఎంట్రీ ఇవ్వడం ఓ చిన్న షార్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్ ఇచ్చేసాయి. యాడ్ లో మరో రెండు పాత్రలు ఉన్నా సమంతాను తప్ప ఇంకెవరిని చూసేలా అనిపించకుండా చేయటంలో సామ్ మేజిక్ ఉంది. విశాల్ అభిమన్యుడు రామ్ చరణ్ రంగస్థలం కీర్తి సురేష్ మహానటి సినిమాల విడుదల కోసం సాం ఫాన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ యు టర్న్ రీమేక్ లో సాం నటించడం దాదాపు ఖరారు అయినట్టే అని టాక్.