Begin typing your search above and press return to search.

పెళ్లి తర్వాత.. ఎక్కువగా నో చెబుతున్నా

By:  Tupaki Desk   |   13 Dec 2017 12:30 PM GMT
పెళ్లి తర్వాత.. ఎక్కువగా నో చెబుతున్నా
X
అక్కినేని కొత్త కోడలు అక్కినేని సమంత పెళ్లి తర్వాత సినిమా చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సాధారణంగా కొంత మంది హీరోయిన్స్  మ్యారేజ్ అయ్యాక ప్రతి విషయంలో చాలా మార్పులు వస్తాయి. సినిమాలను తగ్గించడం లేదా గ్లామర్ షోలకు దూరంగా ఉండడం అలాగే బయట పార్టీలకు వెళ్లకుండా ఉండడం. ఈ విధంగా హీరోయిన్స్ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కానీ సమంత మాత్రం అస్సలు మారలేదట. తన వ్యక్తిగత స్వేచ్చలో ఏ మాత్రం తేడా రాలేదు అంటోంది.

పెళ్ళికి ముందే అమ్మడు ఈ విషయం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇకపోతే పెళ్లికి ముందు ఉన్న ఒక అలవాటులో మాత్రం ఇప్పుడు చాలా తేడా వచ్చిందని చెబుతోంది. తనకు చాదస్తం మరి ఎక్కువైపోయిందని అంటోంది. అప్పట్లో సినిమా కథ ఎంచుకుంటే అందులో అది బాలేదు ఇది బాలేదు అనేదాన్ని ఆ అలవాటు ఇప్పుడు మరి ఎక్కువైపోయిందని సమంత చెబుతోంది. ప్రతి సినిమాలో ఇప్పుడు లోపాలను వెతకాల్సి వస్తోందని చెబుతూ.. చాలా వరకు కథలకు నో చెబుతున్నా అంటోంది ఈ అక్కినేని ఇల్లాలు.

సమంత ఈ మధ్యన ఒక స్టార్ హీరో అఫర్ ని కూడా వదిలేసుకుందట. ఇకనుంచి ఎంత పెద్ద సినిమా అయినా సరే కథలో తన పాత్రకు ప్రత్యేక స్థానం ఉంటేనే ఒకే చేబుతోందట. ఇక లేడి ఓరియెంటెడ్ సినిమాలు వస్తే తప్పకుండా చేస్తానని సమంత చెబుతోంది. ప్రస్తుతం సమంత రంగస్థలం సినిమా షూటింగ్ తో చాలా బిజీగా ఉంది. ఆ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉండనుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఇటీవల సినిమాలోని ఆమె పాత్రకు సంబందించిన కొన్ని షాకింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.