Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సెక్సీ పెళ్ళికూతురు సమంత

By:  Tupaki Desk   |   20 Sep 2017 8:00 AM GMT
ఫోటో స్టోరి: సెక్సీ పెళ్ళికూతురు సమంత
X
చాలా కాలం తార్వత టాలీవుడ్ లో ఒక గొప్ప పెళ్లి వేడుక జరగబోతోంది. తెరపై కనిపించిన భార్య భర్తలు నిజ జీవితంలో కూడా అలానే కనిపించడానికి రెడీ అయిపోతున్నారు. అక్కినేని నాగ చైతన్య వెడ్స్ సమంత అనే పదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో మునిగిపోయాయి. ఇరు సంప్రదాయాల్లో రెండు సార్లు ఒకటవ్వబోతున్న ఈ యువ జంట పెళ్లి బట్టలు కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారట.

ముఖ్యంగా సమంత అయితే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ క్రేశా బజాజ్‌ డిజైన్ చేయించిన అద్భుతమైన డ్రెస్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హిందూ వెడ్డింగ్ లో వేసుకోబోయే ఈ డ్రెస్ సమంతకి చాలా నచ్చిందట. మెరుస్తున్న ఆ సాంప్రదాయ దుస్తుల్లో అమ్మడు చాలా బావుందంటున్నారు నెటిజన్స్. ఎంగేజ్మెంట్ లో వేసుకున్న డ్రెస్ తో అందరిని థ్రిల్ చేసిన సామ్ ఇప్పుడు ఈ సరికొత్త డ్రెస్ లో మరొకసారి అందరిని ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక సెక్సీ పెళ్ళి కూతురిలా తయారైంది.

గోవా లో అక్టోబర్ 6 న హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుండగా. అలాగే అక్టోబర్ 7న క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహం చేసుకోనున్నారు. ఈ అరుదైన పెళ్లి వేడుకకు నాగ్ స్పెషల్ గా 150 మంది స్పెషల్ గెస్టులనే ఆహ్వానించారట. ఇక ఆ తర్వాత హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల్ని పిలిచి రిసిప్షన్ ని నిర్వహిస్తారట.